వాయిస్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ కమిటీ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

వాయిస్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ కమిటీ ఏర్పాటు

Aug 4 2025 4:49 AM | Updated on Aug 8 2025 1:23 PM

నెల్లూరు రూరల్‌: వాయిస్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఫౌండర్‌, చైర్మన్‌ గరికపాటి చంద్రకుమార్‌ తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జాతీయ కోర్‌ కమిటీలో వైస్‌ చైర్మన్‌గా సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి (తెలంగాణ), జాతీయాధ్యక్షుడిగా బాలాజీ శంకర్‌సింగ్‌ (కాకినాడ), కార్యదర్శిగా ఎన్‌.ఉషారాణి (తెలంగాణ), ఉపాధ్యక్షులుగా వై.రఘు (కర్ణాటక), సందీప్‌ కుమార్‌ (ఢిల్లీ), కార్యదర్శులుగా టి.సూరజ్‌సింగ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌), విజయ్‌కుమార్‌ (చైన్నె) ను నియమించామన్నారు. ప్రజలకు ప్రాథమిక హక్కులను వివరిస్తామన్నారు. ప్రభుత్వాలు ప్ర జలను ఎలా మభ్యపెడుతున్నాయో సమాచార హక్కు చట్టం ద్వారా వెలికి తీస్తామన్నారు.

చెస్‌ పోటీల్లో ప్రతిభ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లా చెస్‌ అసోసియేషన్‌, రాయ్‌ చెస్‌ అకాడమీ సంయుక్తంగా ఆదివారం నెల్లూరులో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌ 19 (జూనియర్‌) బాలబాలికల చెస్‌ పోటీల్లో చాంపియన్లుగా వై.సాయిచక్రధర్‌, జి.హిమతేజశ్విని నిలిచారు. నిర్వాహకులు గూడూరు లక్ష్మి, ఆనం పద్మనాభరెడ్డి బహుమతులు అందజేశారు. ప్రతిభ చూపిన వారు ఈనెల 8, 9 తేదీల్లో కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఆర్బిటర్‌ మౌనిక, విష్ణు, బషీర్‌, ఫిడే ఇన్‌స్ట్రక్టర్‌ అజీజ్‌ పాల్గొన్నారు.

రైలు పట్టాలపై తల పెట్టి.. యువకుడి ఆత్మహత్య

కొడవలూరు: రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడవలూరు – కోవూరు రైల్వేస్టేషన్ల మధ్య 184 – 28 – 30 పోస్టుల వద్ద దిగువ లైన్‌లో ఆదివారం జరిగింది. రైల్వే ఎస్సై కె.వెంకట్రావు కథనం మేరకు.. సుమారు 25 సంవత్సరాల వయసున్న యువకుడు పురులియా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకను గుర్తించి సమీపానికి వచ్చాక పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సూపర్‌ స్టైకర్స్‌, నంబర్‌ 12 అని ఉన్న నలుపు, బులుగు రంగు టీషర్ట్‌ ధరించి ఉన్నాడు. నలుపు రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. యువకుడి వివరాలు తెలిసిన వారు 94406 27648 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

వాయిస్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ కమిటీ ఏర్పాటు1
1/2

వాయిస్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ కమిటీ ఏర్పాటు

చెస్‌ పోటీల్లో ప్రతిభ2
2/2

చెస్‌ పోటీల్లో ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement