
కావలి మనీ స్కామ్ తుట్టె కదిలింది
కావలి (జలదంకి): కావలి మనీ స్కామ్‌పై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో అక్రమార్కుల తుట్టె కదలింది. ఆయన ఆరోపించిన 24 గంటల్లోనే బాధితుల నుంచి స్పందన వచ్చింది. బాధితులకు అండగా ఉంటానని ఆయన ఇచ్చిన భరోసాతోపాటు 9704831113 సెల్ నంబరుతో హెల్ప్ డెస్క్, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. శుక్రవారం కావలి పట్టణం వెంగళరావునగర్ 25వ వార్డుకు చెందిన పసుపులేటి బాలయ్య తన బంధువులు 13 మంది కలిసి రూ.91 లక్షలు మనీస్కామ్ సూత్రధారి సుభానీకి కట్టి మోసపోయామని ప్రతాప్‌కుమార్‌రెడ్డికి వినతి అందించాడు. బాధితుడు బాలయ్య మాట్లాడుతూ తనతో పాటు బంధువులు 13 మంది అందరం ఆశతో స్థలం అమ్ముకుని, బంగారు కుదువ పెట్టి ఒకేసారి రూ. 91 లక్షలు కట్టామన్నారు. మేము కట్టిన రెండు నెలలకే మనీ ట్రేడింగ్ సంస్థను మూసివేశారన్నారు. గతంలో కావలి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. మాకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం, సీఎంకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. కావలి ఎమ్మెల్యే వద్దకు పలుమార్లు వెళ్లి తమ గోడు తెలిపామన్నారు. అయినా అతీగతీ లేదన్నారు. దీంతో మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామన్నారు. మీరు ఇచ్చిన భరోసాతో న్యాయం జరుగుతుందని భావించి వచ్చామన్నారు.
ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడుతా: ప్రతాప్‌కుమార్‌రెడ్డి
ఈ మనీస్కాంలో ఎంతో మంది పేదలు, ఉద్యోగులు మోసపోయారని, వారికి న్యాయం చేయడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలం అయ్యారని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మనీస్కామ్‌లో ఎమ్మెల్యేతోపాటు పోలీసులు ముడుపులు తీసుకుని కేసును నీరుగార్చిన విషయం అర్ధమవుతుందన్నారు. మనీస్కామ్‌లో నగదు కట్టి మోసపోయిన ప్రతి ఒక్కరికీ నగదు అందించేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యాలయంలో బాధితులు వినతులు ఇచ్చేందుకు కౌంటర్లు, ప్రత్యేక హెల్స్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. బాధితులు ఎవరికీ భయపడకుండా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, రూరల్ అధ్యక్షుడు వాయిల తిరుపతి, నాయకులు నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు, కుందుర్తి కామయ్య, దామిశెట్టి సుధీర్‌నాయుడు, ఏగూరి పుల్లయ్య, కొండూరు శ్రీనివాసులు, పరుసు మాల్యాద్రి, దయాకర్‌రెడ్డి, పార్థు, ఆర్‌కే కృష్ణారెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి భరోసాతో కదలిక
ఒక్కొక్కరుగా బయటకు
వస్తున్న బాధితులు
రూ. 91 లక్షలు కట్టి మోసపోయానని మాజీ ఎమ్మెల్యేకు ఓ బాధితుడి ఫిర్యాదు
హెల్ప్ డెస్క్ నంబరు 97048 31113, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు