ప్రసన్నకు విష్ణు పరామర్శ | - | Sakshi
Sakshi News home page

ప్రసన్నకు విష్ణు పరామర్శ

Jul 26 2025 8:58 AM | Updated on Jul 26 2025 8:58 AM

ప్రసన

ప్రసన్నకు విష్ణు పరామర్శ

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం పరామర్శించారు. ప్రసన్న ఇంటిపై టీడీపీ మూకలు సాగించిన దాడి నేపథ్యంలో నెల్లూరులోని ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, కక్ష పూరితంగా వ్యవహరించడం సరి కాదన్నారు. రాజకీయంగా విమర్శలకు ప్రతి విమర్శల రూపం ఉండాలే కానీ, ఇళ్లపై పడి ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

పంద్రాగస్టు వేడుకలకు నిధుల విడుదల

నెల్లూరు (టౌన్‌): జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల్లో ఆగస్టు 15 సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 46 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలల్లో వేడుకలకు రూ.25 వేలు నిధులను విడుదల చేశారు. జెండా ఆవిష్కరణ, సౌండ్‌ సిస్టంకు రూ.2 వేలు, పాఠశాల స్థాయిలో ఆటల పోటీల నిర్వహణకు రూ.5 వేలు, స్కిట్స్‌ హిస్టారికల్‌ ఈవెంట్స్‌, బ్యానర్స్‌, లైటింగ్‌కు రూ.3 వేలు, ఎస్‌ఏ రైటింగ్‌, క్విజ్‌ కాంపిటేషన్‌ బహుమతుల కోసం రూ.5 వేలు, పెయిటింగ్‌, పోస్టర్‌ మేకింగ్‌, స్నాక్స్‌కు రూ.10 వేలు ఖర్చు చేయాలని సూచించారు. జిల్లాలో 46 పాఠశాలలకు కలిపి మొత్తం రూ.11.50 లక్షలు నిధులు విడుదల అయ్యాయి.

ప్రతిష్టాత్మకంగా

ఉల్లాస్‌– అక్షరాంధ్ర

కలెక్టర్‌ ఆనంద్‌

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ఉల్లాస్‌–అక్షర ఆఽంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని వయోజన, విద్య, రెవెన్యూ, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలో 100 శాతం వయోజన ప్రాథమిక అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అక్షర ఆంధ్ర అనే ప్రత్యేక కార్యక్రమం రూపొందించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 19,178 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామన్నారు. 2025–26 సంవత్సరానికి 1,08,680 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు బోధనా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. మొదట కోవూరు నియోజకవర్గంలో నిరక్షరాస్యులును అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోరారు. 15 నుంచి 59 సంవత్సరాల్లోపు మహిళలు, పురుషులు, కూలీలు, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీలకు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం, డిజిటల్‌ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత వంటి అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ లక్ష్య సాధనలో ఇతర శాఖలకు చెందిన అధికారులందరూ పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. స్వచ్ఛందంగా బోధించేందుకు ముందుకు వచ్చే ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి తగిన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆగస్టు 7న అక్షరాస్యత కేంద్రాలు ప్రారంభమై ఫిబ్రవరి 2026న బోధనా తరగతులు ముగించాలని కోరారు. మార్చిలో అక్షరాస్యత పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వయోజన విద్యాశాఖ నోడల్‌ అధికారి మస్తాన్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, మెప్మా పీడీ లీలారాణి, డ్వామా పీడీ గంగాభవాని, డీఈఓ బాలాజీరావు, ఐసీడీఎస్‌ పీడీ హేనాసుజన్‌, కోవూరు నియోజకవర్గ మండలా అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

ప్రసన్నకు విష్ణు పరామర్శ 1
1/1

ప్రసన్నకు విష్ణు పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement