
తల్లికి వందనం పడలేదయ్యా !
ఉలవపాడు: తల్లికి వందనం పడలేదయ్యా.. అంటూ మహిళలు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారం పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథికి ఏకరువు పెట్టారు. శుక్రవారం మండలంలోని భీమవరంలో సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తల్లికి వందనం పడలేదని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పలువురు మహిళలు మంత్రిని అడిగారు. సాంకేతిక సమస్యలను సరిచేసి అందరికి ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డులు కావాలని, అంబేడ్కర్‌నగర్‌లోని పాఠశాలను బాగు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరలో అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు హామీలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.