
మోసం చేయడం చంద్రబాబు నైజం
సైదాపురం: ‘ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించడం. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’ అని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని చాగణం కల్యాణ మండపంలో మండల కన్వీనర్ రవికుమార్ యాదవ్ అధ్యక్షతన గురువారం బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల జోలికొస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదన్నారు. సైదాపురం మండలంలో కార్యకర్తలపై వేధింపులు ఎక్కువవుతున్నాయని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన కార్యకర్తలు, నాయకులకు దోచిపెడుతున్నారన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం మాటున రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇంకా నేతలు కంభం విజయభాస్కర్‌రెడ్డి, మాలకొండారెడ్డి, అబ్బిరాజు, సుబ్రహ్మణ్యం ప్రసంగించారు. కార్యక్రమంలో గుంటమడుగు శ్రీనివాసులురాజు, కమలపూడి సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రామ్‌గోపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ తిరకాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
వెంకటగిరి సమన్వయకర్త
నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
చాగణంలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’