
ఆస్పత్రిలోని పరిస్థితులు చక్కదిద్దుతున్నాను
మందులు బయటకు రాసిచ్చారు
పెద్దాస్పత్రిలో కొన్ని రకాల రక్త పరీక్షలు చేయడం లేదు. సుమారు రెండు నెలలుగా థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు నిలిపేశారు. క్లోరైడ్, కాల్షియం టెస్ట్‌లే కాదు.. ఏబీజీ పరీక్ష కూడా చేయడం లేదు. ఇన్ పేషెంట్ల, అవుట్ పేషెంట్లకు వైద్యులు రక్త పరీక్షలు రాసిస్తారు. రిపోర్టులు ఇవ్వాలంటే మధ్యాహ్నం 2 గంటలకు రావాలని చెబుతారు. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ విభాగం సిబ్బంది పరీక్షలు చేసి రిపోర్టులు రాసిస్తారు. అయితే క్లినికల్ పెథాలజీ విభాగంలో అయితే మధ్యాహ్నం 2 గంటల వరకే రిపోర్టులు ఇస్తాం.. ఇప్పుడు ఇవ్వడం కుదరదు. రేపు రండి రాసిస్తాం అని చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక హెచ్‌ఐవీ పరీక్ష చేసే వారు మధ్యాహ్నం నుంచి ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుని రెండు, మూడు రోజుల తర్వాత రావాల్సిన పరిస్థితి ఉంది.
జిల్లా రెఫరల్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో రోగులకు వైద్య సేవలు అందడం గగనమే. సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలు పడి వస్తే ఇక్కడ సిబ్బంది నుంచి వైద్యుల వరకు అలవి కాని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పది గంటలకు కాని వైద్యులు రారు. వచ్చినా.. గంట గంటన్నర కంటే ఎక్కువ సేపు ఉండరు. ఏదైనా వైద్య సేవ కోసం వచ్చిన వారికి పరీక్షలు రాసిస్తే.. రిపోర్టులు వచ్చే సరికి మధ్యాహ్నం 2 గంటలు పడుతోంది. వాటిని పట్టుకుని వైద్యుల వద్దకు వెళ్లే సరికి వారు వెళ్లిపోయి ఉంటారు. రిపోర్టులు పరిశీలించి మందులు రాసివ్వాలంటే.. మరుసటి రోజు రావాల్సిందే.
నెల్లూరు (అర్బన్): పెద్దాస్పత్రిలో గుండె, న్యూరాలజీ, యూరాలజీ, అంకాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు ఆర్థోపెడిక్, పల్మనాలజీ, నేత్ర, చర్మ, దంత, ఈఎన్‌టీ చిన్నపిల్లల వైద్యం తదితర స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీరితోపాటు జనరల్ ఫిజిషియన్ విభాగం, జనరల్ సర్జరీ, గైనిక్ వంటి పలు ప్రత్యేక విభాగాలున్నాయి. డాక్టర్లు ఉదయం 8 గంటలకే విధులకు హాజరు కావాలి. ఇన్ పేషెంట్ల వార్డుల్లో రౌండ్స్‌కు వెళ్లి 9 గంటల అంతా ఓపీలోకి వచ్చి సేవలందించాలి. మధ్యాహ్నం లంచ్ పూర్తయ్యాక సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలందించాలి. అయితే ఎక్కువ మంది డాక్టర్లు చుట్టపు చూపుగా 10 గంటలకు వస్తున్నారు. పట్టుమని 12 గంటల వరకు కూడా ఓపీలో కూర్చోవడం లేదు. ఆ కాస్త సమయం కూడా నాడి పట్టరు.. బీపీ చూడరు. ఏదో పేషెంట్‌ను చూశామా.. రెండు మాత్రలు రాశామా.. రక్తపరీక్షలు రాశామా అనే విధంగా వైద్యం అందిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత అడ్రస్ ఉండరు. రోగులకు పరీక్షలు రాసిస్తారు. ఆ రిపోర్టులు వచ్చే సరికి సీనియర్ డాక్టర్లు జంప్ అవుతున్నారు. ఆ తర్వాత జూనియర్ డాక్టర్లే దిక్కు. వీరు సైతం మధ్యాహ్నం తర్వాత సక్రమంగా రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పేరుకే సూపర్ స్పెషాలిటీ సేవలు
పెద్దాస్పత్రిలో కేన్సర్, న్యూరో సర్జన్, యూరాలజీ, గుండె వంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లున్నారు. వీరిలో ఎక్కువ మంది కార్పొరేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్నారు. పెద్దాస్పత్రిలో థంబ్ (హాజరు) వేసి ఒక గంట పాటు కూడా రోగులకు సేవలందించడం లేదు. రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో డాక్టర్ల ఇష్టారాజ్యంగా మారింది.
జ్వరాలతో పెరిగిన రోగులు
ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ఓపీ సంఖ్య 1000 నుంచి 1300 వరకు ఉంటోంది. ఇన్ పేషెంట్ల సంఖ్య సుమారు 500 వరకు ఉంటోంది. ఓపీ రోగుల్లో కనీసం 300 నుంచి 350 మంది వరకు జ్వరాలు, ఒంటి నొప్పుల బాధితులే ఉండటం విశేషం. గత నెలతో పోలిస్తే 15 శాతానికి పైగా జ్వర పీడితులు ఎక్కువయ్యారు. జ్వరాల బారిన పడుతున్న చిన్న పిల్లలు, వార్డుల్లో చికిత్స పొందుతున్న వారు అధికంగా ఉంటున్నారు.
ప్రధాన మందుల కొరత
ప్రభుత్వ పెద్దాస్పత్రిలో కొన్ని రకాల కీలక మందులు అందుబాటులో ఉండడం లేదు. సైకియాట్రి(మానసిక) చికిత్సకు వాడే లిథియం కార్పొనేట్ 450 మి.గ్రా. మాత్రలు, రిస్‌పెరిడాన్ 2 మి.గ్రా. మాత్రలు, హలో పెరిడాల్ 5 మి.గ్రా. మాత్రలు ఆస్పత్రిలో మందుల షాపు వద్దకు వస్తే అవి లేవని బయట కొనుగోలు చేయమని ఫార్మాసిస్ట్ రోగులకు చెబుతున్నారు. దీంతో బయట అత్యధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొత్తి కడుపులో మంట, ఇరిటేషన్‌కు వాడే సిట్రాల్క సిరప్ (టానిక్) కూడా లేదు. చర్మానికి సంబంధించిన కాండిడ్ డెస్టింగ్ పౌడర్ రాసిచ్చినా ఆస్పత్రిలో దొరకదు. చెవికి సంబంధించిన డివాక్స్ చుక్కల మందులేదు. కొన్ని రకాల చర్మ సంబంధ మందులు కూడా లేవు.
లిఫ్ట్ మరమ్మతులు చేయక.. మెట్లు ఎక్కలేక
ల్యాబోరేటరీ విభాగంలోని మొదటి అంతస్తులో రక్త పరీక్షలు చేస్తున్నారు. అక్కడ పేరుకు మాత్రమే లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ ఒక గంట పని చేస్తే పది రోజులు మరమ్మతులకు గురై ఉంటుంది. కొంత కాలంగా ఇదే తంతు. లిఫ్ట్ మరమ్మతుల పేరిట వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కానీ లిఫ్ట్ మాత్రం రిపేరుకు నోచుకోవడం లేదు. దీంతో పలువురు దివ్యాంగులు, ముసలి వారు మెట్లు ఎక్కి రాలేక కిందనే ఆగిపోతున్నారు. కొంత మంది రక్తపరీక్షలు చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. నడవలేని వారిని వీల్ చైర్‌లో తీసుకెళ్లేందుకు నాలుగో తరగతి ఉద్యోగులు అందుబాటులో ఉండటం లేదు. రోగుల బంధువులే తిరిగి, తిరిగి బతిమాలి ఎక్కడో ఉండే వీల్ చైర్‌ను తీసుకు వచ్చి నెట్టుకుని డాక్టర్, పరీక్షల వద్దకు పోతున్నారు.
పరీక్షల్లో నిర్లక్ష్యం..
పెద్దాస్పత్రిలో వైద్యం గగనం
విధుల్లో సీనియర్ వైద్యుల నిర్లక్ష్యం
టెస్ట్‌లు రాసిస్తారు..
రిపోర్టులు వచ్చేలోపు జంప్
మధ్యాహ్నం 2 గంటల దాటితే
రిపోర్టులు ఇచ్చేది పక్క రోజే!
అందుబాటులో లేని అన్ని రకాల
రక్తపరీక్షలు
మందుల కొరత.. కనీస వసతులు కరువు
పని చేయని లిఫ్ట్‌లు.. రోగులకు అవస్థలు
నేను ఏడాదిగా పెద్దాస్పత్రిలోని సైకియాట్రీ విభాగంలో వైద్యం కోసం వస్తున్నాను. కొన్ని దఫాలు డాక్టర్ రాసిచ్చిన మందులుంటున్నాయి. వాటిని ఇస్తున్నారు. అప్పుడప్పుడు ఇక్కడ మందులు అయిపోతున్నాయంట. బయట కొనుక్కోమని చెబుతున్నారు. ఇటీవల కూడా కూడా ఒక రకం మందులు ఇచ్చారు. – సురేష్, పోలూరు గ్రామం,
సూళ్లూరుపేట మండలం
నేను బాధ్యతలు చేపట్టి కేవలం రెండు వారాలు మాత్రమే కావస్తోంది. ఇక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించాను. లిఫ్ట్‌లు మరమ్మతులు చేయిస్తున్నాం. ల్యాబ్‌లో థైరాయిడ్ ప్రొఫెల్ పరీక్ష చేసేందుకు అవసరమైన రియేజంట్స్ కొనుగోలు చేయించాం. విధులకు సక్రమంగా హాజరు కాని డాక్టర్లపై చర్యలు తీసుకుంటాను.
– డాక్టర్ కె.మాధవి, సూపరింటెండెంట్,
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

ఆస్పత్రిలోని పరిస్థితులు చక్కదిద్దుతున్నాను

ఆస్పత్రిలోని పరిస్థితులు చక్కదిద్దుతున్నాను

ఆస్పత్రిలోని పరిస్థితులు చక్కదిద్దుతున్నాను

ఆస్పత్రిలోని పరిస్థితులు చక్కదిద్దుతున్నాను

ఆస్పత్రిలోని పరిస్థితులు చక్కదిద్దుతున్నాను

ఆస్పత్రిలోని పరిస్థితులు చక్కదిద్దుతున్నాను