వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్‌

Jul 17 2025 8:48 AM | Updated on Jul 17 2025 8:48 AM

వైఎస్

వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్‌

నెల్లూరు సిటీ: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ బధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ సాగిస్తున్న దాష్టీకాలు, అధికార యంత్రాంగం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలపై చర్చించారు.

సోషల్‌ వెల్ఫేర్‌ డీడీకి చార్జ్‌మెమో

కలువాయి (సైదాపురం): జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ మీటింగ్‌లో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ శోభారాణికి చార్జ్‌మెమో ఇవ్వాలని డీఆర్‌ను కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌ ప్రాంగణంలో బుధవారం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు మురళీ కృష్ణయాదవ్‌, శ్రీరాములు మాట్లాడుతూ ఇటీవల కలువాయి ఎస్సీ బాలుర, బాలికల హాస్టల్లో తనిఖీ నిర్వహించిన డీడీ శోభారాణి అక్కడ ఎస్సీ, బాలుర హాస్టల్‌లో వార్డెన్‌, ట్యూటర్లు లేకపోయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అజెండా లేకుండా సమావేశాన్ని నిర్వహించారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శాఖాపరమైన చర్యల నేపథ్యంలో డీడీకి చార్జ్‌మెమో ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు.

ఉపాధ్యాయుడు

కృష్ణ సస్పెన్షన్‌

కావలి (జలదంకి): మండలంలోని లింగంగుంట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణను సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు కావలి ఎంఈఓ గోవిందయ్య తెలిపారు. టీచర్‌ కృష్ణ అనధికారికంగా పాఠశాలకు సెలవులు పెట్టకుండా హాజరు కాకపోవడంతో పాఠశాల మూతపడిన విషయాన్ని సాక్షి ‘నేనెప్పుడొస్తే.. అప్పుడే బడి’ శీర్షికన బుధవారం వెలుగులోకి తెచ్చింది. ఇదే సమయంలో సదరు ఉపాధ్యాయుడు కృష్ణ సీఆర్పీతో అసభ్య ప్రవర్తన వంటి కారణాలతోపాటు శని, ఆదివారం సెలవుల తర్వాత సోమ, మంగళవారాల్లో సైతం సెలవు పెట్టకుండా విధులకు హాజరు కాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు కావలి విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఈఓ గోవిందయ్య ఈ విషయమై స్పందిస్తూ జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో కృష్ణను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ బాలాజీరావు ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.

ఎరువులు, విత్తన దుకాణాల్లో సెంట్రల్‌ స్క్వాడ్‌ తనిఖీలు

రూ.1,76,82,587 విలువైన స్టాక్‌ సీజ్‌

ఉదయగిరి: పట్టణంలోని పలు ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలను బుధవారం సెంట్రల్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు చేశారు. స్టాక్‌ రిజిస్టర్లు, ఇన్‌వాయిస్‌, బిల్లులు పరిశీలించారు. నకిలీ పురుగు మందులు, విత్తనాలను ఏవైనా ఉన్నాయోనని తనిఖీలు చేశారు. శ్రీ నరహరి ఫర్టిలైజర్స్‌లో పురుగు మందుల స్టాక్‌ రిజిస్టర్‌ ఫార్మాట్‌ రూపంలో లేనందున రూ.49,18,150 విలువైన స్టాక్‌ను, బాలాజీ ఫర్టిలైజర్స్‌లో ఇదే పరిస్థితి ఉండడంతో రూ.1,27,64,437 విలువైన స్టాక్‌ను సీజ్‌ చేశారు. సెంట్రల్‌ స్క్వాడ్‌ అధికారులు మాట్లాడుతూ రైతులు తీసుకున్న ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు తప్పని సరిగా బిల్లులు అందజేయాలన్నారు. నాణ్యత లేని ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో అధికారులు సీహెచ్‌ రవికుమార్‌, ఎన్‌.రాఘవరావు, నర్సోజీరావుతోపాటు ఉదయగిరి ఏడీఏ చెన్నారెడ్డి, ఏఓ కె.విజయభాస్కర్‌ ఉన్నారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్‌1
1/2

వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్‌

వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్‌2
2/2

వైఎస్‌ జగన్‌ను కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement