
ఏపీఎల్ క్రికెట్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
నెల్లూరు (బృందావనం): ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ పోటీలకు సంబంధించి నిర్వహించిన వేలంలో జిలా క్రీడాకారులు ఏడుగురిని వివిధ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో రంజీ క్రీడాకారుడు అశ్విన్‌హెబ్బార్ విజయవాడ సన్‌షైనర్స్ అత్యధికంగా రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. సాకేత్‌రామ్‌ను రూ.2.20 లక్షలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, రేవంత్‌రెడ్డిని రూ.1.4 లక్షలకు భీమవరం బుల్స్ కొనుగోలు చేశాయి. భార్గవ్ మహేష్‌ను రూ.60 వేలకు అమరావతి రాయల్స్, పి.రోషణ్‌ను రూ.60 వేలకు సింహాద్రి వైజాగ్ లైన్స్, టి.భరత్‌ను రూ.50 వేలకు విజయవాడ సన్‌షైనర్స్, తోషిత్‌యాదవ్‌ను రూ.30 వేలకు తుంగభద్ర వారియర్స్ కొనుగోలు చేశారు. జిల్లాకు చెందిన ఏడుగురు క్రీడాకారులు ఆగస్టు 8వ తేదీ నుంచి విశాఖపట్నంలో ప్రారంభం కానున్న ఏపీఎల్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు అభినందించారు.

ఏపీఎల్ క్రికెట్ పోటీలకు జిల్లా క్రీడాకారులు