
అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు
● సూపర్ సిక్స్‌తోపాటు
ప్రజాపథకాలకు మంగళం
● అవినీతి, అక్రమ కేసులతో
వేధించడమేనా సుపరిపాలనా?
● కావలి మాజీ ఎమ్మెల్యే
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
బిట్రగుంట: కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమ కేసులు తప్ప అభివృద్ధి జాడే కనిపించడం లేదని కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గం ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. బోగోలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ జువ్వలదిన్నె వద్ద సుమారు రూ.340 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే అని తెలిపారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తీరుపై వ్యంగా స్త్రాలతో మండిపడ్డారు. అభివృద్ధి అంటే మీడియాలో, సోషల్ మీడియాలో ఫొటోలకు ఫోజులివ్వడం కాదని తెలుసుకోవాలన్నారు. పదేపదే కావలిని కాపు కాస్తా, బోగోలును కాపు కాస్తా, మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అంటూ ఊతపదాలు వల్లెవేయడం కాదని, ప్రజలకు ఇప్పటి వరకూ ఏం మంచి చేశారో చెప్పాలన్నారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలను గుర్తించాలని సూచించారు.
● వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు మాట్లాడుతూ ఏనుగులబావిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై వందలాది మంది చూస్తుండగానే కత్తులతో దాడి చేయడమే కాకుండా చివరకు బాధితులపై హత్యాయత్నం కేసులు పెట్టి నెలరోజులపాటు జైల్లో మగ్గేలా చేశారన్నారు. కడనూతలలో కూడా అమాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని వివరించారు. మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా బోగోలుకు చెందిన యువతిపై ఐదు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల సుజాత, జెడ్పీటీసీ మద్దిబోయిన కీర్తన, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మద్దిబోయిన పద్మ, నాయకులు మేకల శ్రీనివాసులు, ఏకే సుందర్‌రాజు, కల్యాణ్ కుమార్, కర్తం సురేందర్‌రెడ్డి, తుమ్మల రమణయ్య నాయుడు, పర్రి అంకులయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.