
సరైన బిల్లులు లేకపోవడంతో..
● పురుగు మందుల అమ్మకాల
నిలిపివేత
చేజర్ల(ఆత్మకూరు): సరైన బిల్లుల్లేని రూ.4 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలు నిలిపివేయాలని డైరెక్టర్ ఆఫ్ అగ్రిక ల్చర్ సీహెచ్ రవికుమార్ ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయం నుంచి రవికుమార్‌తోపాటు విజిలెన్స్ అధికారి రాఘవరావు చేజర్ల మండలంలోని ఆదూరుపల్లిలో పలు ఆగ్రో సర్వీస్ ఫర్టిలైజర్ షాపుల్లో మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పురుగు మందులకు సరైన సర్టిఫికెట్లు, బిల్లులు లేకపోవడంతో అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట జిల్లా వ్యవసాయ అధికారులు ఏడీఏ నర్సోజీరావు, శివనాయక్, స్థానిక వ్యవసాయ అధికారిణి హిమబిందు, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు.
రూ.3.24 లక్షల విలువైన నిల్వలపై స్టే
కోవూరు: మండలంలో ఎరువులు, పురుగు మందుల గోదాముల్లో మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ రాఘవరావు, సహాయ వ్యవసాయ సంచాలకుడు వినుకొండ రవికుమార్, మండల వ్యవసాయ అధికారిణి నీరజ తదితరులు పలు డిపోల్లో లైసెన్స్ లేకుండా పురుగు మందులు నిల్వ పెట్టినట్లు గుర్తించారు. రూ.3,24,650 విలువైన పురుగు మందుల అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

సరైన బిల్లులు లేకపోవడంతో..