నెల్లూరు (అర్బన్): ‘నన్ను చంపించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వారి అనుచరులతో ఈ నెల 7వ తేదీ రాత్రి నా ఇంటిపై దాడి చేయించారని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కలెక్టర్ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసును నీరు గార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోమవారం మాజీమంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి ప్రసన్నకుమార్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. మా ఇంటిపై దాడి జరిగినప్పుడు మా ఇంటిని పరిశీలిస్తున్న డీఎస్పీ పక్కనే ఉన్న నాల్గో నగర ఎస్‌హెచ్‌ఓ, తర్వాత రోజు ఏఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. దాడి గురించి ఫిర్యాదు చేసిన కాపీని సెల్‌ఫోన్ వాట్సాప్ ద్వారా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ, ఎస్‌హెచ్‌ఓ పంపానన్నారు. కొన్ని వీడియోల ద్వారా ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్న వారిని గుర్తించామన్నారు. కోడూరు కమలాకర్‌రెడ్డి, దువ్వూరు కల్యాణరెడ్డి, జెట్టి రాజగోపాల్‌రెడ్డి, ఇంత మల్లారెడ్డి, పెనుబల్లి కృష్ణచైతన్య, కొల్లు సుధాకర్‌రెడ్డి, సాయితేజ, బెల్లంకొండ విజయకుమార్‌పాటు అనేక మంది దాడిలో పాల్గొన్నారని తెలుపుతూ ఫిర్యాదు చేశానన్నారు. ఈ విషయాలను ఈ నెల 12న రాష్ట్ర డీజీపీకి రిజిస్టర్ పోస్టులో పంపానన్నారు. 7వ తేదీ దాడి జరిగితే 12వ తేదీన నా కంప్లెంట్ రిజిస్టర్ చేశారని తెలిపారు. అయితే తాను ఇచ్చిన పేర్లను, అనుమానితులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదన్నారు. ఉద్దేశ పూర్వకంగా వేమిరెడ్డి దంపతులు, ఇతర అనుమానితులతో పోలీసులు కుమ్మకై ్క కేసును నీరు గార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవడంతోపాటు తాను ఇచ్చిన ఫిర్యాదులోని పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి వారిపై హత్యాయత్నంతోపాటు చట్టపరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మా ఇంట్లో విధ్వంసం చేయించింది వేమిరెడ్డి దంపతులే
మాజీ మంత్రి నల్లపరెడ్డి
ప్రసన్నకుమార్‌రెడ్డి
దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
కేసును పోలీసులు నీరు గార్చే కుట్ర