
పోరాటాలకు సిద్ధం కండి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలంటూ రానున్న రోజుల్లో చేపట్టనున్న పోరాటాలకు సిద్ధంగా ఉండాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న పిలుపునిచ్చారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన డీవైఎఫ్‌ఐ నెల్లూరు రూరల్ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని అందజేయాలని డిమాండ్ చేశారు. యువత సత్తా ఏమిటో రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తెలియజేస్తామని స్పష్టం చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. డీవైఎఫ్‌ఐ నెల్లూరు రూరల్ అధ్యక్ష, కార్యదర్శులుగా శశి, చైతన్య, సహాయ కార్యదర్శిగా రాజా, ఉపాధ్యక్షుడిగా బాపనయ్య, కోశాధికారిగా మధు, 11 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. మాదాల వెంకటేశ్వర్లు, కట్టా సతీష్, కొండా ప్రసాద్, పెంచలనరసయ్య తదితరులు పాల్గొన్నారు.