
‘సాక్షి’ రిపోర్టర్ కుటుంబానికి విక్రమ్‌రెడ్డి సాయం
నెల్లూరు(అర్బన్): సాక్షి దినపత్రికలో చేజర్ల మండల రిపోర్టర్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందిన రవీంద్రబాబు అంత్యక్రియలు స్వగ్రామమైన కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో మంగళవారం జరిగాయి. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తన వంతుగా బాధితుడి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ చేజర్ల మండల నాయకుల ద్వారా రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. మట్టి ఖర్చుల కింద సాక్షి నెల్లూరు యూనిట్ మేనేజర్ శ్రీనివాసులు రూ.5 వేలు అందించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు పోలంరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, తేళ్ల శేఖరయ్య, ఉగ్గుమూరు రఘురామిరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి మస్తాన్‌రెడ్డి, బీఎం శ్రీనివాసులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎం మాట్లాడుతూ త్వరలోనే మృతుడి కుటుంబానికి ‘సాక్షి’ కార్యాలయం తరఫున రూ.2 లక్షల్ని బీమా ద్వారా అందిస్తామన్నారు.