
80 శాతం బియ్యం విదేశాలకు ఎగుమతి
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా
ఆదేశాలను పౌరసరఫరాల శాఖ
పాటిస్తోంది. ఆ శాఖలోని కొందరు
అధికారులు మామూళ్లు తీసుకొని మాఫియా ఏం చెబితే అదే చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పోస్టింగ్‌ల నుంచి, బియ్యం అక్రమ రవాణాకు క్లీన్‌చిట్ ఇచ్చే వరకు పౌరసరఫరాల శాఖ మాఫియా చేతిలో కీలుబొమ్మలా మారింది. మాఫియా డాన్ ద్వారా గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల నుంచి
ఇక్కడికి ప్రతి నెలా వచ్చే బియ్యంలో
80 శాతం విదేశాలకు తరలిపోతోంది.
జిల్లాలో 1,563 చౌకదుకాణాలు ఉండగా 7.23 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం కార్డుదారులకు చౌకదుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. అయితే జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. 80 శాతం బియ్యం అక్రమ మార్గంలో రాష్ట్ర, దేశ హద్దులు దాటుతున్నాయని తెలుస్తోంది. జిల్లానే కాకుండా ప్రకాశం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల నుంచి సైతం పేదల బియ్యం కావలి, నెల్లూరు కేంద్రంగా రైస్ మిల్లులకు చేరుతున్నాయి. ఇక్కడ పాలిష్ పట్టి స్థానిక మార్కెట్లో అధిక ధరలకు విక్రయంతోపాటు కృష్ణపట్నం పోర్టు, చైన్నె పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో బియ్యం మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తికి షిప్‌లో 30 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలు పూర్తిస్థాయిలో ఉండడం, అక్రమ రవాణాకు సహకరించిన అధికారులకు నెల నెలా రూ.లక్షల్లో మామూళ్లు అందుతుండడంతో మాఫియాను అడ్డుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉంటే బియ్యం మాఫియా డాన్ తన అక్రమ సంపాదనతో ఏకంగా ఒక రైస్ మిల్లును ఏర్పాటు చేశాడు. అఽధిక మొత్తంలో బియ్యం వస్తుండడంతో నగర పరిధిలోని సౌత్‌రాజుపాళెంలో మరో రెండు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని పేదల బియ్యం పాలిష్ పడుతున్నట్లు సమాచారం. ఈ మూడు మిల్లుల్లో పేదల బియ్యం మాత్రమే పాలిష్ పట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడ ఈ ఏడాది కాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఆడించినట్లు రికార్డులు కూడా లేకపోవడం గమనార్హం.

80 శాతం బియ్యం విదేశాలకు ఎగుమతి