
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్
నెల్లూరు (లీగల్): జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘ భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శనివారం ప్రారంభించారు. జిల్లా న్యాయశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సురేష్, నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లగా స్పందించి ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక, వృత్తి పరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులు కష్టపడి పని చేయాలని, న్యాయస్థానానికి మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు పరిపాలనాధికారి నాగరాణి, నాయకులు వెంకటసునీల్ కుమార్, ఝఠి శివకుమార్, దీపక్ పాల్గొన్నారు.
కల్యాణం.. కమనీయం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో శనివారం పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామి, అమ్మవార్లను సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. 6 గంటలకు పూలంగి సేవ నిర్వహించారు. 10 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపంలో కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. సాయంత్రం ఊంజల్ సేవ చేశారు.
నేడు పది కేంద్రాల్లో నీట్
● హాజరుకానున్న
2,913 మంది విద్యార్థులు
నెల్లూరు (టౌన్): నీట్‌ను ఆదివారం జిల్లాలో పది జూనియర్, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించనున్నారు. నగరంలోని స్టోన్‌హోస్‌పేటలోని పీఎస్‌ఆర్‌ఎంసీహెచ్ స్కూల్, కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయం, దర్గామిట్టలోని డీకేడబ్ల్యూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, ఏసీనగర్‌లోని ఎంపీఎల్ కార్పొరేషన్ హైస్కూల్, పొదలకూరు రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల, పప్పులవీధిలోని వైవీఎం నగర పాలక ఉన్నత పాఠశాల, సంతపేటలోని ఆదర్శ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,913 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష మధ్యాహ్న 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనుంది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 తరువాత అనుమతించరు.
మాలకొండ మాల్యాద్రికి
రూ.11.79 లక్షల ఆదాయం
వలేటివారిపాలెం: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి శనివారం రూ.11.79 లక్షలు ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈఓ కే సాగర్‌బాబు తెలిపారు. కుంకుమార్చన ద్వారా రూ.20,840, తలనీలాలు రూ.72,375, ప్రత్యేక దర్శనం రూ.4,35,200, రూమ్ అద్దెలు రూ.35,330, లడ్డు ప్రసాదాలు రూ.2,47,390, అన్నదానానికి రూ.3,30,518 ఇతర విరాళాలు కలిపి ఆదాయం రూ.11,79,689 వచ్చినట్లు ఆయన తెలిపారు.
సంతృప్తికరంగా
లక్ష్మీనరసింహుడి దర్శనం
రాపూరు: పెంచలకోనలో ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్క భక్తుడూ సంతృప్తిగా శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేలా ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పెంచలకోనలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలసి సమన్వయ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ, కల్యాణోత్సవం రోజుల్లో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరికీ ఉచిత లడ్డూ అందించాలని ఆదేశించారు. నెల్లూరు ఆర్టీఓ అనూషా, దేవదాయశాఖ ఏసీ జనార్దన్‌రెడ్డి పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి