కసుమూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

కసుమూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Published Tue, Nov 14 2023 12:44 AM

- - Sakshi

వెంకటాచలం: మండలంలోని కసుమూరులో గుర్తుతెలియని వ్యక్తి (50) మృతదేహాన్ని స్థానికులు సోమవారం సాయంత్రం గుర్తించారు. మెయిన్‌రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తి పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు అతని వద్దకు వెళ్లి పరిశీలించారు. ఎలాంటి కదలిక లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు గత కొన్నేళ్లుగా కసుమూరులోనే ఉంటున్నట్లుగా గుర్తించారు. అనారోగ్య సమస్యతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాబా హోటల్‌లో సర్వర్‌పై దాడి

మనుబోలు: మండలంలోని కొండూరుసత్రం వద్ద ఉన్న కాటియా దాబా హోటల్‌లో సర్వర్‌పై ఆదివారం రాత్రి కొందరు మందు బాబులు దాడి చేశారు. వివరాలు..వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి దాబాకు వచ్చారు. కస్టమర్లు తిరిగే ప్రదేశంలో చేతులు కడుగుతూ అపరిశుభ్రం చేస్తుండగా సర్వర్‌గా పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్‌ ప్రధాన్‌ వారిని వారించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకులు బూతులు తిడుతూ ప్రదీప్‌పై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు బాధితుడు ప్రదీప్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాడిలో గాయపడిన 
సర్వర్‌ ప్రదీప్‌
1/1

దాడిలో గాయపడిన సర్వర్‌ ప్రదీప్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement