
108లో కండక్టర్‌ను ఆత్మకూరుకు తరలిస్తున్న దృశ్యం
● వేరే బస్సులో ప్రయాణికుల తరలింపు
ఆత్మకూరురూరల్ (మర్రిపాడు): ఆర్టీసీ బస్సులో విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ రామకృష్ణ అవస్థతకు గురయ్యాడు. దీంతో ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. ఈ ఘటన మర్రిపాడు మండలం నందవరం మోడల్ స్కూల్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. డ్రైవర్ మున్వర్‌బాషా, కండక్టర్ రామకృష్ణ బస్సులో ప్రయాణికులను ఎక్కించుకుని ఆత్మకూరు నుంచి ఉదయగిరి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మోడల్ స్కూల్ సమీపంలో ఒక్కసారిగా రామకృష్ణ ఛాతినొప్పిగా ఉందని చెప్పాడు. డ్రైవర్ వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. వారు వచ్చి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆత్మకూరుకు తరలించారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. రామకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.