
షెడ్యూల్‌ను ప్రదర్శిస్తున్న అధికారులు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) అండర్ –19 క్రీడా షెడ్యూల్‌ను గురువారం నెల్లూరు కేఏసీ కళాశాలలో ఉన్న డీవీఈఓ కార్యాలయంలో డీవీఈఓ కె.మధుబాబు, ఆర్‌ఐఓ డాక్టర్ ఎ.శ్రీనివాసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 25న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, బ్యాడ్మింటన్, త్రోబాల్ పోటీలు జరుగుతాయన్నారు. 26న స్టేడియంలోనే ఖోఖో, హాకీ, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, టేబుల్ టెన్నిస్, 27న డీకేడబ్ల్యూ కళాశాల, చిల్లకూరు గురుకులంలో చెస్, హ్యాండ్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్ని కాయిట్ పోటీలు నిర్వహిస్తారన్నారు. 29న ఏసీ స్టేడియంలో సెపక్‌తక్రా, నెట్‌బాల్, టెన్నిస్, అక్టోబర్ 2న స్టేడియంలోనే క్రికెట్, తైక్వాండో, యోగా, ఫుట్‌బాల్, కబడ్డీ, ఆర్చరీ, రోప్ స్విప్, సెపక్‌తక్రా, 3న స్టేడియంలో రగ్బీ, జూడో, జిమ్నాస్టిక్స్, సాఫ్ట్ టెన్నిస్, చిల్డ్రన్స్ పార్క్‌లో స్కేటింగ్ పోటీలు జరుగుతాయన్నారు. క్రీడాకారులు పదో తరగతి మార్క్స్ మెమో లేదా జనన ధ్రువీకరణపత్రం తీసుకురావాలని తెలిపారు. ఫారం–3లో ప్రిన్సిపల్ మరియు, పీడీ, సంతకాలతో హాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి, పీడీ డి.శ్రీరేష్ ఫోన్ నంబర్ 97048 27095ను సంప్రదించాలన్నారు.