
సంక్షేమ పథకాల బుక్‌లెట్ అందజేస్తున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
● ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్‌రెడ్డి
కొండాపురం: పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. మండలంలోని గరిమెనపెంట పంచాయతీలో గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికారులు, నాయకులతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించి బుక్‌లెట్లను లబ్ధిదారులకు అందజేశారు. స్థానికులు పలు సమస్యలను రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చినట్లు తెలిపారు. జగనన్న కాలనీలు, అమ్మఒడి, రైతు భరోసా, పింఛన్లు, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు అందుతున్నాయన్నారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మారినట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడడం దారుణమన్నారు. రానున్న ఎన్నికల్లోనూ వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బొడ్డు అనురాధ, వెఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చిమ్మిలి రవీంద్ర, గుడవళ్లూరు సొసైటీ అధ్యక్షుడు కర్తం శ్రీనివాసులురెడ్డి, జేఏసీ కన్వీనర్ యారం నరసింహారావు, మాజీ కన్వీనర్ చిమ్మిలి రాజేంద్రప్రసాద్ వైఎస్సార్‌సీపీ నాయకులు పరుచూరి మాల్యాద్రి, వేమిరెడ్డి మల్లికార్జున, యారం వెంకటేశ్వర్లు, షేక్ అహ్మద్ శ్రీను, వెంకట్రావ్, బొడ్డు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.