కోహ్లి సూపర్‌ క్యాచ్‌.. కష్టాల్లో ఆసీస్‌

Watch Kohli Stunning Catch In Ashwin Bowling In Pink Test - Sakshi

అడిలైడ్‌ : టీమిండియాతో జరుగుతున్న పింక్‌ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతుంది. 84 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆసీస్‌ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్నస్‌ లబుషేన్‌ 43 పరుగులతో, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ 4 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 3 వికెట్లు తీయగా.. బుమ్రా రెండు వికెట్లు తీశాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో కామెరాన్‌ గ్రీన్‌ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి అద్భుతంగా డ్రైవ్‌ చేస్తూ ఒడిసి పట్టుకున్నాడు. ఈ సూపర్‌ క్యాచ్‌ దెబ్బకు ఆసీస్‌ 5వ వికెట్‌ కోల్పోయింది. (చదవండి : పృథ్వీ షా ఏందిది?)

వన్డేల్లో మంచి ప్రదర్శన కనబరిచిన స్టీవ్‌ స్మిత్ను కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో వెనుదిరగడం భారత్‌కు సానుకూలాంశంగా మారింది. స్టీవ్‌ స్మిత్‌ భారత్‌పై ఇప్పటివరకు 21 ఇన్నింగ్స్‌లు ఆడగా.. 5 పరుగులలోపు అవుట్‌ కావడం ఇదే తొలిసారి. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. కోహ్లి 74 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రహానేతో సమన్వయ లోపంతో కోహ్లి రనౌట్‌గా వెనుదిరగడం అభిమానులను నిరాశ పరిచింది. (చదవండి : 51 ఏళ్ల రికార్డును తిరగరాసిన కోహ్లి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top