Virender Sehwag: ఇంగ్లండ్‌తో సిరీస్‌.. వారిద్దరి ఆట మరువలేనిది

Virender Sehwag Praises Rohit And KL Rahul Contribution Cannot Forgotten - Sakshi

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఓపెనర్లిద్దరి ఆటతీరు అద్భుతమని పేర్కొన్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్‌ మాట్లాడాడు.'' రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ భాగస్వామ్యాలు మరువలేనివి. లార్డ్స్‌ టెస్టులో సెంచరీ భాగస్వామ్యంతో పాటు నాటింగహమ్‌, ఓవల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో రెండు ఫిప్టీ ప్లస్‌ భాగస్వామ్యాలు నమోదు చేయడం జట్టుకు కలిసి వచ్చింది. 30 నుంచి 40 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన ఈ ద్వయం టీమిండియాను పటిష్టస్థితిలో నిలిచేలా చేసింది. అయితే కొన్నిసార్లు ఈ ఇద్దరు విఫలం కావడం.. మిడిలార్డర్‌ వైఫల్యంతో తక్కువ స్కోర్లకే ఆలౌట్‌ కావాల్సి వచ్చింది. లీడ్స్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో అదే జరిగింది.

చదవండి: IPL 2021: కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌


రోహిత్‌ , రాహులిద్దరు చెరో సెంచరీతో మెరవడం.. వాళ్లు సెంచరీ  చేసిన మ్యాచ్‌లు టీమిండియా గెలవడం మరో విశేషం. సూపర్‌ థ్రిల్లర్‌గా జరిగిన ఈ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మూడు టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలతో అలరించాడు.  ఇక 2-1తో ఆధిక్యంలో ఉ‍న్న టీమిండియా ఇంగ్లండ్‌పై ఆధిక్యంలో ఉన్నట్లే. ప్రస్తుతానికి కరోనా కారణంగా ఐదో టెస్టు మ్యాచ్‌ వాయిదా పడింది. మ్యాచ్‌ నిర్వహించాలా వద్దా అనేది ఇరు బోర్డులు చర్చించి ఒక నిర్ణయానికి వస్తాయి. ఇక సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ 2021 రెండో అంచె పోటీలు మొదలవనున్నాయి. మళ్లీ వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా మూడు టీ20లతో పాటు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇదే సమయంలో రద్దయిన టెస్టు మ్యాచ్‌ నిర్వహిస్తారని భావిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు.  

చదవండి: Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top