'కొత్త కిట్ బాగుంది.. ఈసారైనా సాధిస్తావా'

Virat Kohli Flaunts New Kit As RCB Captain Gears Up For IPL 2020 - Sakshi

ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రానున్న ఐపీఎల్ 13వ సీజ‌న్‌లో కొత్త బ్యాటింగ్ కిట్‌తో బ‌రిలోకి దిగుతున్నాడు. కోహ్లి వాడ‌నున్న కొత్త కిట్‌ను ఎంఆర్ ఎఫ్ స్పాన్స‌ర్ చేస్తుంది. ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగుళూరు జ‌ట్టుకు కోహ్లి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టినుంచి పేప‌ర్‌పై బ‌లంగా క‌నిపించే బెంగుళూరు జ‌ట్టు మైదానంలో మాత్రం బ‌ల‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. దీనికి తోడు ఆ జ‌ట్టును దుర‌దృష్టం కూడా వెంటాడుతుంది. స్టార్ ఆట‌గాళ్లు క‌లిగి ఉండి కూడా ఒక్క‌సీజ‌న్‌లోనూ టైటిల్‌ను గెల‌వ‌లేక‌పోయింది. దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 13వ సీజ‌న్‌లోనైనా జ‌ట్టు త‌ల‌రాత మారుతుందేమో చూడాలి. (అంద‌రికంటే ముందుగా యూఏఈకి చెన్నై జ‌ట్టు)

గ‌తంలో 2009 ఐపీఎల్ 2వ సీజ‌న్ ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగింది. ఆ సీజ‌న్‌లో బెంగుళూరు జ‌ట్టు మంచి ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసి ఫైన‌ల్‌కు చేరుకుంది. కానీ ఫైన‌ల్లో అప్ప‌టి డెక్క‌న్ చార్జ‌ర్స్ చేతిలో ఓడిపోయింది. మ‌ళ్లీ 11 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఐపీఎల్ విదేశంలో జ‌రుగుతుంది. మ‌రి ఈసారి అదే ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి ఆర్‌సీబీ జ‌ట్టు టైటిల్ గెలుస్తుందేమో చూడాలి. ఇక కోహ్లి కొత్త బ్యాటింగ్ కిట్‌పై అభిమానులు స‌ర‌దాగా ఫ‌న్నీ కామెంట్ చేశారు. కోహ్లి.. నీ కొత్త కిట్ బాగుంది.. మ‌రి ఈసారైనా ఆర్‌సీబీకి  టైటిల్ తీసుకొస్తావా అంటూ పేర్కొన్నారు.

క‌రోనా వ‌ల్ల దాదాపు నాలుగు నెల‌లు ఆట‌కు దూరంగా ఉన్న కోహ్లి ప్ర‌స్తుతం ఐపీఎల్‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంట్లోనే ఉంటూ పూర్తిగా ఫిట్‌నెస్ పైనే దృష్టి సారించిన కోహ్లి ఇప్పుడు సీరియ‌స్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదే త‌ర‌హాలో భార‌త క్రికెట‌ర్లైనా రిష‌బ్ పంత్‌, సురేశ్ రైనా, ఉమేశ్ యాద‌వ్, ఇషాంత్ శ‌ర్మ త‌మ ప్రాక్టీస్ వీడియోల‌ను షేర్ చేసుకున్నారు. ఐపీఎల్ 13వ సీజ‌న్ గెలిచే అవ‌కాశాలు కోహ్లి నేత‌`త్వంలోని ఆర్‌సీబీ జ‌ట్టుకు పుష్క‌లంగా ఉన్నాయంటూ మాజీ టెస్టు ఓపెన‌ర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయ‌ప‌డ్డాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా నేప‌థ్యంలో ఐపీఎల్ 13వ సీజ‌న్‌ను సెప్టెంబ‌ర్ 19 నుంచి దుబాయ్ వేదిక‌గా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. కాగా ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌, షెడ్యూల్‌, మ్యాచ్ వివ‌రాల‌పై రేపు ఐపీఎల్ గ‌వర్నింగ్ కౌన్సిల్ స‌మావేశం కానుంది. (కొడుకుతో దిగిన ఫోటోను షేర్‌ చేసిన హార్దిక్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top