సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. హైదరాబాద్ చేరుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్‌ | Virat Kohli arrived in Hyderabad for the upcoming IPL match | Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. హైదరాబాద్ చేరుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్‌

Apr 23 2024 9:24 PM | Updated on Apr 23 2024 9:25 PM

Virat Kohli arrived in Hyderabad for the upcoming IPL match - Sakshi

ఐపీఎల్‌-2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాటింగ్ ప‌రంగా ప‌ర్వాలేద‌న్పిస్తున్న ఆర్సీబీ.. బౌలింగ్ ప‌రంగా మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవ‌లం ఒక్క మ్యాచ్‌లో మాత్రం విజ‌యం సాధించి.. పాయింట్ల ప‌ట్టిక‌లో అట్టడుగు స్థానంలో కొన‌సాగుతోంది.

వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి కూడా దాదాపు నిష్క్ర‌మించిన‌ట్లే. అయితే క‌నీసం మిగిలిన మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టోర్నీని ఘనంగా ముగించాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్‌లో మరో కీలక పోరుకు ఆర్సీబీ సిద్దమైంది. ఏప్రిల్ 25న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది.

ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హైదరాబాద్ చేరుకున్నాడు. జట్టు కంటే ముందే విరాట్ భాగ్యనగరంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లూక్‌లో విరాట్ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

కాగా ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ నిరాశపరుస్తున్నప్పటికి.. కోహ్లి మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 379 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement