టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2026 నాకౌట్ మ్యాచ్‌లలో దారుణంగా విఫలమైన వరుణ్.. ఇప్పుడు ఐపీఎల్-2026లో అదే తీరును కనబరుస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తరపున వరుణ్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అయితే చక్రవర్తి బౌలింగ్‌ను ఉతికారేశాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా వరుణ్‌కు చుక్కలు చూపించాడు. ఈ తమిళనాడు స్పిన్నర్ మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో 48 పరుగులిచ్చి వికెట్ లెస్‌గా వెనుదిరిగాడు.
ఈ నేపథ్యంలో చక్రవర్తిపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ బౌలింగ్‌లో ఇక ఏమాత్రం 'మిస్టరీ' మిగిలిలేదని, అతడి పని అయిపోయందని శ్రీకాంత్ విమర్శించాడు.
"వరుణ్ చక్రవర్తి బంతిని స్పిన్ చేయడం నేర్చుకోకపోతే కచ్చితంగా ఇబ్బంది పడతాడు. ఎప్పుడూ గూగ్లీలే వేస్తానంటే కుదరదు. బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలి. తన లెగ్ స్పిన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి. అతడి బౌలింగ్‌లో ఇప్పుడు ఎలాంటి మిస్టరీ లేదు.
అతడి మిస్టరీ కాస్త హిస్టరీ అయిపోయింది. లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ, బంతిని బ్యాటర్లకు కాస్త దూరంగా వేయాలి. అప్పుడే బ్యాటర్లు షాట్లు ఆడేందుకు భయపడతారు. అంతేకాకుండా పవర్‌ప్లేలో అతడితో బౌలింగ్ చేయించకూడదు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
పవర్ ప్లేలో వరుణ్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ ఏకంగా 15 పరుగులు పిండుకున్నాడు. వరుణ్ బంతితో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వికెట్ల విషయం పక్కన పెడితే కనీసం పరుగులు కూడా కట్టడి చేయలేకపోయాడు. మరి తర్వాతి మ్యాచ్‌లలో ఎలా రాణిస్తాడో చూడాలి మరి.
చదవండి: జడ్డూ, సందీప్ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?: సంగక్కర


