హెచ్‌డీబీఏ అధ్యక్షుడిగా చాముండేశ్వరనాథ్‌ | Vankina Chamundeswaranath is New President Of HDBA | Sakshi
Sakshi News home page

హెచ్‌డీబీఏ అధ్యక్షుడిగా చాముండేశ్వరనాథ్‌

May 26 2026 6:13 AM | Updated on May 26 2026 6:13 AM

Vankina Chamundeswaranath is New President Of HDBA

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ (హెచ్‌డీబీఏ) అధ్యక్షుడిగా మరోసారి వంకిన చాముండేశ్వరనాథ్‌ ఎంపికయ్యారు. కానూరి వంశీధర్‌ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో అన్ని పదవులకు ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది. ఆరుగురు ఉపాధ్యక్షులలో మాజీ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, జాస్తి శారదా గోవర్ధిని ఉన్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు (2026–30) ఈ కార్యవర్గం కొనసాగుతుంది.  

హెచ్‌డీబీఏ కొత్త కార్యవర్గం వివరాలు: 
అధ్యక్షుడు:వి.చాముండేశ్వరనాథ్‌; 
ఉపాధ్యక్షులు: దగ్గుబాటి సురేశ్‌బాబు, ఒంటెద్దు శ్రీనివాస రెడ్డి, ఇందుకూరి వెంకటసోమరాజు, ఆదినారాయణ కమ్మ, జాస్తి శారదా గోవరి్ధని, పారుపల్లి కశ్యప్‌;
 ప్రధాన కార్యదర్శి: కానూరి వంశీధర్‌;
నిర్వాహక కార్యదర్శి: గున్ను విజయ్‌ రాఘవన్‌
కోశాధికారి: కొల్లి నాగవేణి; సంయుక్త 
కార్యదర్శులు: చిట్టబోయిన రమేశ్‌ యాదవ్, గంటా శారదా రెడ్డి; 
సభ్యులు: జయేశ్‌ రంజన్, మున్నంగి బంగారుబాబు, బొంబోజి రాజ్‌గోపాల్‌ చారి, సిద్ధార్థ్‌ రెడ్డి ఆరంరెడ్డి, మొహమ్మద్‌ మఖ్దూమ్‌ అహ్మద్‌ ఖాద్రీ, సీబీ తారాప్రశాంత్‌ చంద్ర, పల్లె చంద్రశేఖర్‌ రావు, వంకిన రమ్య, నామాల పురుషోత్తం రావు.   
 

Advertisement
 
Advertisement
Advertisement