
U 19 World Cup Winner India:- విశాఖ స్పోర్ట్స్: భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. రషీద్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్ర రెడ్డి, కోశాధికారి గోపినాథరెడ్డి, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు, సీఈవో శివారెడ్డి ఆకాంక్షించారు.
మరోవైపు ప్రపంచకప్‌లో భారత జట్టుకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న హైదరాబాద్ యువ క్రికెటర్ రిషిత్ రెడ్డికి రూ. 10 లక్షలు అందజేస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు.