ఇంగ్లండ్‌తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు? | Two Changes That India Are Expected To Make In Their Playing XI | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు?

Jan 27 2025 3:12 PM | Updated on Jan 27 2025 3:27 PM

Two Changes That India Are Expected To Make In Their Playing XI

భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుతం స్వ‌దేశంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డుతోంది. ఇప్ప‌టికే తొలి రెండు టీ20ల్లో విజ‌యం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో ప‌ర్యాట‌క జ‌ట్టును ఢీకొట్టేందుకు సిద్ద‌మైంది. 

రాజ్‌కోట్ వేదిక‌గా మంగ‌ళవారం భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య మూడో టీ20 జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ జట్టు మాత్రం ఎలాగైనా తిరిగి పుంజుకోవాల‌ని ప‌ట్టుద‌లతో ఉంది. ఇక రాజ్‌కోట్ టీ20లో​ భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

శివమ్ దూబే రీఎంట్రీ?
మూడో టీ20కు భార‌త తుది జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే వ‌చ్చే అవ‌కాశ‌ముంది. చెపాక్ టీ20కు ముందు గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మైన  నితీశ్‌కుమార్ స్ధానాన్ని దూబేతో బీసీసీఐ భ‌ర్తీ చేసింది. అయితే అప్ప‌టికే దూబే రంజీ ట్రోఫీలో ఆడుతుండ‌డంతో రెండో టీ20లో ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్క‌లేక‌పోయాడు. రెండో టీ20 అనంత‌రం రాజ్‌కోట్‌లో జ‌ట్టుతో దూబే క‌లిశాడు.

ఈ క్ర‌మంలో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ధ్రువ్ జురెల్ స్దానంలో తుది జ‌ట్టులోకి దూబే రావ‌డం ఖాయ‌మ‌ని క్రికెట్ విశ్లేషుకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా దూబే టీ20 వరల్డ్‌కప్‌-2024 గెలిచిన జట్టులో సభ్యునిగా ఉన్నాడు. ఆ తర్వాత గాయం బారిన పడడంతో బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లకు దూరమయ్యాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు 6 నెలల భారత జట్టు తరపున ఆడేందుకు ఈ ముంబై ఆల్‌రౌండర్ సిద్దమయ్యాడు.

మహ్మద్ షమీకి ఛాన్స్‌..
ఇక తొలి రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) రాజ్‌కోట్ టీ20లో ఆడనున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజ్‌కోట్ వికెట్‌​ సాధరణంగా పేస్ బౌలర్లకు అనుకూలిస్తోంది. ఈ క్రమంలోనే మూడో టీ20లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది.

స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను పక్కన పెట్టి షమీని తుది జట్టులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అయితే తొలి రెండు టీ20ల్లో షమీకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదన్న విషయంపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. కనీసం మూడో టీ20లో అయినా తమ ఆరాధ్య క్రికెటర్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

భారత తుది జట్టు(అంచనా)
సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మ‌హ్మ‌ద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్‌ వర్మ!: భారత మాజీ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement