ఆసియా కప్‌ ‘సూపర్‌–4’ వేదికల్లో మార్పు లేదు.. ఫైనల్‌ అక్కడే | There is no change in venues | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: ఆసియా కప్‌ ‘సూపర్‌–4’ వేదికల్లో మార్పు లేదు.. ఫైనల్‌ అక్కడే

Sep 6 2023 3:27 AM | Updated on Sep 6 2023 8:44 AM

There is no change in venues - Sakshi

కొలంబో: భారీ వర్షాల కారణంగా కొలంబోలో జరగాల్సిన ఆసియా కప్‌ ‘సూపర్‌–4’ మ్యాచ్‌లు, ఫైనల్‌ వేదికను మార్చవచ్చంటూ జరిగిన చర్చకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఒక మ్యాచ్‌ బుధవారం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య లాహోర్‌లో... ఫైనల్‌ సహా తర్వాతి 6 మ్యాచ్‌లు కొలంబోలోనే జరుగుతాయని ప్రకటించింది.

మ్యాచ్‌లను హంబన్‌టోటాకు మార్చే విషయంపై ప్రసారకర్తల అభ్యంతరం సహా ఇతర సమస్యలు ఉండటంతో ఏసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కొలంబోలో రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చని నిర్వాహకులు ఆశిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ‘సూపర్‌–4’ దశలో ఈ నెల 10న పాకిస్తాన్‌తో, 12న శ్రీలంకతో, 15న బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement