Ashes 2021-22: ప్రతిష్టాత్మక టెస్ట్‌ సిరీస్‌లో తెలంగాణ కుర్రాడు..

Telangana Cricket Commentator Rakesh Deva Reddy In Ashes Series 2021 - Sakshi

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో(2021-22) తెలంగాణ కుర్రాడు రాకేశ్ దేవారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. డిసెంబర్‌ 16 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌కు సంబంధించిన తెలుగు కామెంటరీ బాక్స్‌లో రాకేశ్‌ వ్యాఖ్యాతగా కనిపించనున్నాడు. 

ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన రాకేశ్.. మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, సబా కరీం, లక్ష్మణ్ శివరామకృష్ణన్‌లతో పాటు విశ్లేషకులు వెంకటేష్ సుధీర్‌లతో కలిసి కామెంట్రీ బాక్స్‌ని షేర్ చేసుకోబోతున్నాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాకేశ్‌కు ఈ గౌరవం దక్కడం తెలంగాణ ప్రాంతానికే గౌరవమని ఆ ప్రాంత ప్రజలు ముచ్చట పడిపోతున్నారు. 

సింగరేణి నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రాకేశ్‌.. చిన్నతనం నుంచి క్రికెట్‌ ఆడుతూ అంచెలంచెలుగా ఎదిగాడు. చదువుల్లో రాణిస్తూనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వహించిన ఎన్నో లీగ్‌ల్లో పాల్గొని రాణించాడు. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డ రాకేశ్‌.. ఉద్యోగం చేసుకుంటూనే క్రికెట్‌ విశ్లేకుడిగా, వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు.
చదవండి: గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్‌ మజాక్‌.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top