
Lendl Simmons Equals Bangladesh Alok kapali Record: టీ20 ప్రపంచకప్-2021 సూపర్ 12లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఓపెనర్ లెండిల్ సిమన్స్ చెత్త రికార్డు నెలకొల్పాడు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక బంతులను ఎదుర్కొని బౌండరీ సాధించని ఆటగాడిగా బంగ్లా ఆటగాడు అలోక్ కపాలి రికార్డును సమం చేశాడు. 2007 ప్రపంచకప్‌లో కపాలి 35 బంతులను ఎదుర్కొని ఒక్క బౌండరీ కుడా సాధించకుండా కేవలం 14 మాత్రమే చేయగా.. ఈ మ్యాచ్‌లో సిమన్స్ అదే 35 బంతులను ఎదుర్కొని బౌండరీ లేకుండా 16 పరుగులు చేశాడు.
ఇదే ప్రపంచకప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆటగాడు మాట్ క్రాస్ 35 బంతుల్లో బౌండరీ లేకుండా 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచి వీరిద్దరితో సమంగా నిలిచాడు. ఇదిలా ఉంటే, సఫారీలతో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్(35 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: Mohammad Shami: పాక్ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్..!