"రోహిత్ అద్భుత‌మైన కెప్టెన్‌.. 10కి 9.99 రేటింగ్‌" | Sunil Gavaskar Rates Rohit Sharmas 1st Match As Full Time India White Ball Captain | Sakshi
Sakshi News home page

IND vs WI: "రోహిత్ అద్భుత‌మైన కెప్టెన్‌.. 10కి 9.99 రేటింగ్‌"

Feb 7 2022 11:32 AM | Updated on Jun 9 2022 6:59 PM

Sunil Gavaskar Rates Rohit Sharmas 1st Match As Full Time India White Ball Captain - Sakshi

అహ్మదాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో 6 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఫుల్ టైమ్ వైట్-బాల్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ తొలి మ్యాచ్‌లోనే భార‌త్‌కు అద్భుతమైన విజ‌యాన్ని అందించాడు. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ‌పై భార‌త క్రికెట్ దిగ్గ‌జం  సునీల్ గవాస్కర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్సీకు 10కి 9.99 రేటింగ్ గవాస్కర్ ఇచ్చారు. "ఇది అత‌డికి కెప్టెన్‌గా అద్భుత‌మైన ప్రారంభం. టాస్ గెలిచి రోహిత్ స‌రైన నిర్ణ‌యం తీసుకున్నాడు.

అత‌డికి ఈ విజ‌యం ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. అదే విధంగా రోహిత్  కెప్టెన్‌గానే కాకుండా బ్యాట‌ర్‌గా కూడా భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఫీల్డ్ ప్లేసింగ్ కూడా రోహిత్ అద్భుతంగా పెట్టాడు.  అదే విధంగా కీల‌క స‌మ‌యాల్లో బౌలింగ్‌లో మార్పులు చేసి కెప్టెన్‌గా తాను ఎంటో నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్సీ ప్ర‌ద‌ర్శ‌న‌కి 10కి 9.99 ఇస్తున్నాను" అని  గవాస్కర్ పేర్కొన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ 60 ప‌రుగులు చేసి భార‌త్‌కు ఘ‌న‌మైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఇక భార‌త్‌-విండీస్ జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే బుధ‌వారం జ‌ర‌గ‌నుంది.

చ‌ద‌వండి: U 19 WC- Shaik Rasheed: షేక్‌ రషీద్‌కు 10 లక్షల నజరానా... రిషిత్‌ రెడ్డికి ఎంతంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement