
ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్‌లో ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ చెలరేగిపోయాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ టోర్నీలో సోమర్‌సెట్‌కు ఆడుతున్న మెరిడిత్.. నిన్న (జులై 8) ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరివీర భయంకరంగా బౌలింగ్ చేశాడు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి ఎసెక్స్ ఓపెనర్ కైల్ పెప్పర్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా.. వికెట్ మధ్యలో రెండు ముక్కలుగా చీలింది. ఇది చూసి మెడిరిత్ చాలా ఆనందపడ్డాడు. సహజంగానే ఏ ఫాస్ట్ బౌలర్‌కు అయినా ఇది గర్వంచదగ్గ సందర్భం. మెరిడిత్ కూడా దీన్ని ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
RILEY SNAPS THE STUMP DOWN THE MIDDLE 🤯
Have you ever seen this before?!?#SOMvESS#WeAreSomerset pic.twitter.com/VQ244pq8RR— Somerset Cricket (@SomersetCCC) July 8, 2025
కాగా, ఈ మ్యాచ్‌లో మెరిడిత్ జట్టు సోమర్‌సెట్ ఎసెక్స్‌పై 95 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్‌సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (39 బంతుల్లో 90; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శన చేశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. సోమర్‌సెట్ ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (4-0-21-4), రిలీ మెరిడిత్ (2-0-22-2), క్రెయిగ్ ఓవర్టన్ (3.1-0-32-2) ధాటికి 14.1 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో నోవా థైన్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.