సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సంచలన నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్, సపోర్ట్ స్టాప్ నియమాకాల్లో పారదర్శకత తీసుకురావడానికి బెంగాల్ క్రికెట్ చారిత్రత్మక అడుగు వేసింది. సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లాతో క్యాబ్ తెగదెంపులు చేసుకుంది.
అంతర్గతంగా జరిగే నియామకాలకు స్వస్తి పలికి, మెరిట్ ఆధారంగా కొత్త కోచ్‌లను ఎంపిక చేయాలని క్యాబ్ నిర్ణయించింది. ఇందుకోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీసీసీఐ మాదిరిగానే ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు మే 1 సాయంత్రం 5 గంటలలోపు ధరఖాస్తు చేసుకోవచ్చు.
కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు అర్హతులు ఇవే
👉కనీసం 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు లేదా 1 టెస్ట్, 30 వన్డేలు లేదా 45 టీ20లు ఆడి ఉండాలి
👉బీసీసీఐ లెవల్ 2 లేదా లెవల్ 3 కోచింగ్ సర్టిఫికేట్ తప్పనిసరి
👉ఒకవేళ ఆడిన అనుభవం లేకపోతే, సీనియర్ డొమెస్టిక్ జట్లు లేదా వయోపరిమితి జట్లకు 3 నుండి 5 ఏళ్ల పాటు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.
👉దరఖాస్తుదారుల వయస్సు 60 ఏళ్ల లోపు ఉండాలి.
👉సీనియర్ పురుషల జట్టు, మహిళల జట్టు, ఏజ్ గ్రూపు జట్లు(U-16, U-19, U-23) కోచ్ పదవులను భర్తీ చేయనున్నారు.


