
వన్డే ప్రపంచకప్-2203లో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. 113 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన కివీస్‌ను.. టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన బాగస్వామ్యంతో అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 144 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.
న్యూజిలాండ్ బ్యాటర్లలో ఫిలిప్స్(71) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టామ్ లాథమ్(68), విల్ యంగ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ ఫీల్డింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. నాలుగు సునాయస క్యాచ్‌లను ఆఫ్గాన్ ఫీల్డర్లు విడిచిపెట్టారు. ఇక ఆఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్,రషీధ్ ఖాన్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: World Cup 2023: టీమిండియాను ఓడిస్తే బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తా: పాక్ నటి