
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు షేన్ వాట్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాకు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను హార్దిక్ ఒంటి చేత్తో అందిస్తాడని వాట్సన్ కొనియాడాడు. కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చాక హార్దిక్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పడు ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022లో తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ఇక ఈ ఏడాది ప్రపంచకప్-2022లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆక్టోబర్ 23న తలపడనుంది.
ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో వాట్సన్ మాట్లాడుతూ.. "హార్ధిక్ పాండ్యా చాలా ప్రతిభావంతుడైన క్రికెటర్. అతడు 140 కి.మీ స్పీడ్‌తో బౌలింగ్ చేసే విధానం అద్భుతమైనది. అతడికి మిడిల్ ఓవర్లలో వికెట్ల తీసే సత్తా ఉంది. ఇక హ్యార్దిక్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. అతడు ప్రస్తుతం బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. హార్దిక్ కేవలం ఫినిషర్ మాత్రమే కాదు, పవర్ హిట్టర్ కూడా.
అతడికి అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో హార్దిక్ ప్రదర్శననుమనం చూశాం. హార్దిక్ ఏ విధంగా అయితే గుజరాత్‌కు టైటిల్‌ను అందించాడో.. ఇప్పడు భారత్‌కు కూడా ఒంటి చేత్తో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందిస్తాడు" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు