వెస్టిండీస్‌ క్రికెట్‌ సంచలన నిర్ణయం.. ఏకంగా 7 గురు కొత్త ఆటగాళ్లకు ఛాన్స్‌ | Seven uncapped players selected as West Indies name Test squad for Australia | Sakshi
Sakshi News home page

AUS vs WI: వెస్టిండీస్‌ క్రికెట్‌ సంచలన నిర్ణయం.. ఏకంగా 7 గురు కొత్త ఆటగాళ్లకు ఛాన్స్‌

Dec 21 2023 8:18 AM | Updated on Dec 21 2023 8:54 AM

Seven uncapped players selected as West Indies name Test squad for Australia - Sakshi

ఆస్ట్రేలియాతో  రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్‌ క్రికెట్‌ ప్రకటించింది. ఈ బృందానికి క్రైగ్ బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్నాడు. కాగా జట్టు ఈ ఎంపిక విషయంలో విండీస్‌ సెలక్షన్‌ కమిటీ సంచలన నిర్ఱయం తీసుకుంది. ఆసీస్‌ సిరీస్‌కు ఏకంగా 7 మంది ఆన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ను విండీస్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు.

జాచరీ మెక్‌కాస్కీ, టెవిన్ ఇమ్లాచ్, జస్టిన్ గ్రీవ్స్, కవెమ్ హాడ్జ్, కెవిన్ సింక్లైర్,అకీమ్ జోర్డాన్,షామర్ జోసెఫ్‌లు తొలిసారి విండీస్‌ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్లు జాసెన్‌ హోల్డర్‌, కైల్ మేయర్స్, ఛేజ్‌లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక ఈ సిరీస్‌ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ 2023-25 సైకిల్‌లో భాగంగా జరగనుంది. ఆడిలైడ్‌ వేదికగా జనవరి 12 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

వెస్టిండీస్ టెస్ట్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్‌), అల్జారీ జోసెఫ్ (వైస్‌ కెప్టెన్‌), టాగెనరైన్ చందర్‌పాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథానాజ్, కావెం హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డాసిల్వా, అకీమ్ జోర్డాన్, గుడాకేష్ మోటీ, కెవిన్ ఇక్లా రోచ్, టెవిన్ ఇక్లా రోచ్, షమర్ జోసెఫ్, జాకరీ మెక్‌కాస్కీ
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. తిలక్‌పై వేటు! ఆర్సీబీ ప్లేయర్‌ అరంగేట్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement