IND vs AUS: 'కింగ్‌ పరుగుల వేట మళ్లీ మొదలైంది.. ఇక తిరుగులేదు'

Sanjay Bangar lauds Virat Kohli for his stunning show against Australia - Sakshi

హైదరాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు . భారత్‌ విజయం సాధించడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు.

అదే విధంగా సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి మూడో వికెట్‌కు 104 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని విరాట్‌ నెలకొల్పాడు. ఇక ఈ కీలక పోరులో విజయం సాధించిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కోహ్లిపై టీమిండియా మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడూతూ..."విరాట్‌ ఛాంపియన్‌ బ్యాటర్‌. గతంలో చాలా మ్యాచ్‌లల్లో  టీమిండియాను కోహ్లి ఒంటి చేత్తో గెలిపించాడు. ఇప్పడు విరాట్‌ తన రిథమ్‌ తిరిగి మళ్లీ పొందాడు.  కొన్నాళ్ల పాటు ఆట నుంచి విరామం తీసుకోవడం విరాట్‌కు కలిసొచ్చింది. అతడి పరుగుల వేట మళ్లీ మొదలైంది. అది విరాట్‌ బాడీ లాంగ్వేజ్‌చూస్తే మనకు ఆర్ధమవుతోంది.

అదే విధంగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లి ఇదే జోరును కొనసాగిస్తాడని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్‌ సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్‌.. భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top