ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. క్లాసెన్ మైం‍డ్ బ్లాంక్‌ | Rovman Powell’s One Handed Flying Catch Dismisses Klaasen As KKR Dominate SRH Clash In IPL 2026, More Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2026: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. క్లాసెన్ మైం‍డ్ బ్లాంక్‌

May 3 2026 6:18 PM | Updated on May 3 2026 6:31 PM

Rovman Powell Puts His Life At Risk To Pull Off A Worldie Catch

ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ రోవ్‌మన్ పావెల్ మరోసారి తన సంచలన ఫీల్డింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పావెల్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

ఎస్‌ఆర్‌హెచ్ డేంజరస్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను సూపర్ క్యాచ్‌తో పావెల్ పెవిలియన్‌కు పంపాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన  కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో నాలుగో బంతిని క్లాసెన్  లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే టైమింగ్ కుదరకపోవడంతో బంతి గాలిలోకి లేచింది.

ఈ క్రమంలో డీప్ మిడ్ వికెట్ నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన రోవ్‌మన్ పావెల్..  తన కుడివైపు గాలిలోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో ఉప్పల్ మైదానంలో ప్రేక్షకులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

కాగా ఈ క్యాచ్‌ను అందుకునే క్రమంలో పావెల్‌ తలకు గాయం కూడా అయ్యే అవకాశముండేది. అయినప్పటికి రిస్క్‌ తీసుకుని మరి పావెల్‌ బంతిని ఒడిసిపట్టాడు. కాగాఇదే సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పావెల్‌ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. 

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 19 ఓవర్లలో 19 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ట్రావెస్‌ హెడ్‌(61), ఇషాన్‌ కిషన్‌(42) మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సీఎస్‌కే చిచ్చర పిడుగు




 

 

Advertisement
 
Advertisement
Advertisement