లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాజాగా రోహిత్ శర్మ ఓపెనర్‌గా( అన్ని ఫార్మాట్లు) 11వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే ఓపెనర్‌గా అత్యంత వేగంగా 11వేల మైలురాయిని అందుకున్న రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. ఓపెనర్‌గా రోహిత్ శర్మ 246 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సచిన్ 241 ఇన్నింగ్స్‌లతో తొలి స్థానంలో ఉండగా.. మాథ్యూ హెడెన్ 251 ఇన్నింగ్స్‌లతో మూడో స్థానం, సునీల్ గావస్కర్ 258 ఇన్నింగ్స్‌లతో నాలుగో స్థానంలో, గార్డన్ గ్రీనిడ్జ్ 261 ఇన్నింగ్స్‌లతో ఐదో స్థానంలో నిలిచాడు.
చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన షమీ.. వీడియో వైరల్
ఓపెనింగ్ జోడిగా రోహిత్- రాహుల్ మరో రికార్డు
► కాగా ఇదే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడి రోహిత్- రాహుల్‌లు మరో రికార్డు సాధించారు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు(393 పరుగులు) సాధించిన ఓపెనింగ్ జోడిగా రోహిత్- రాహుల్ మూడో స్థానంలో ఉన్నారు. ఆకాశ్ చోప్రా- సెహ్వాగ్ జోడి 459 పరుగులు(ఆస్ట్రేలియా, 2003-04) తొలి స్థానంలో ఉండగా.. చౌహన్-గావస్కర్ జోడి 453 పరుగులు( ఇంగ్లండ్, 1979) రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో చౌహన్- గావస్కర్ జోడి మూడుసార్లు చోటుదక్కించుకోవడం విశేషం.
Rohit Sharma & KL Rahul opening partnership has been the major difference of the series. pic.twitter.com/65yIwzhoYe
— Johns. (@CricCrazyJohns) September 4, 2021
ఇక మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతుంది. 43/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 42, రోహిత్ శర్మ 31 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఇంకా 25 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: అరుదైన ఫీట్‌ను సాధించిన హిట్ మ్యాన్.. దిగ్గజాల సరసన చేరిక


