పిల్లలతో గోళీలాట ఆడిన రిషబ్ పంత్.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024: పిల్లలతో గోళీలాట ఆడిన రిషబ్ పంత్.. వీడియో వైరల్‌

Published Mon, Mar 4 2024 2:17 PM

Rishabh Pant relives childhood, plays marbles with children ahead of IPL 2024 - Sakshi

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దాదాపు 15 నెలల నుంచి ఆటకు దూరంగా ఉంటున్న పంత్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌తో మళ్లీ బ్యాట్‌ పట్టనున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ఢిల్లీ క్యాపిటిల్స్‌ ఫ్రాంచైజీ ధ్రువీకరించింది. నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీ కూడా రిషబ్‌కు త్వరలోనే క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇది ఇలా ఉండగా.. ఆదివారం ఏన్సీఏ నుంచి బయటకు వచ్చిన పంత్‌ రోడ్డు పక్కన చిన్నపిల్లలతో గోళీల ఆట ఆడాడు. సరదగా పిల్లలతో ఆడుతూ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. వారితో ఆడే క్రమంలో ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి కర్చీఫ్, తలకు క్యాప్ పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన స్కోరు ఎంత అని పిల్లలను అతడు అడగడం కూడా వీడియోలో కన్పించింది.
చదవండి: IND vs ENG: మూడే 3 సిక్స్‌లు.. వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన జైశ్వాల్‌?

Advertisement
 
Advertisement
 
Advertisement