
రిక్కీ పాంటింగ్‌పై వేటు(PC: DC X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్‌తో తమ అనుబంధాన్ని తెంచుకుంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. ఏడేళ్లపాటు కొనసాగిన బంధానికి ఇక తెరపడిందంటూ.. రిక్కీ పాంటింగ్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.
వేటు వేయడానికి కారణం అదే?
కాగా 2018లో రిక్కీ పాంటింగ్ ఢిల్లీ క్యాంపులో చేరాడు. ప్యాటీ ఉప్టన్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఢిల్లీ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఏడేళ్లపాటు ప్రధాన కోచ్‌గా కొనసాగాడు.
అయితే, 2020లో ఫైనల్ చేరడం మినహా అతడి మార్గదర్శనంలో ఢిల్లీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. అయినప్పటికీ యాజమాన్యం పాంటింగ్‌పై నమ్మకం ఉంచింది.
అయితే, వేలంలో పాల్గొనడం మినహా జట్టు కూర్పు తదితర అంశాలపై మరింతగా దృష్టి సారించాలని మేనేజ్‌మెంట్ కోరగా.. పాంటింగ్ నుంచి స్పందన కరువైందని సమాధానం.
ఐపీఎల్ సీజన్ ఆరంభానికి కేవలం రెండు వారాలు ముందే జట్టుతో చేరడం పట్ల యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అతడిని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇక రిక్కీ పాంటింగ్ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని నియమించేందుకు ఢిల్లీ మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
కొత్త కోచ్‌గా దాదా?
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్‌గా ఉన్న దాదాను ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాలని కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీసీ సహ యజమానులైన జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూపు పెద్దలు ఈ విషయమై వచ్చే నెలలో భేటీ అయి.. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అదే విధంగా.. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ గురించి కూడా చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రిషభ్ పంత్‌తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను కొనసాగించేందుకు మేనేజ్‌మెంట్ సుముఖంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
చదవండి: Ind vs Zim 4th T20: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్
After 7 seasons, Delhi Capitals has decided to part ways with Ricky Ponting.
It's been a great journey, Coach! Thank you for everything 💙❤️ pic.twitter.com/dnIE5QY6ac— Delhi Capitals (@DelhiCapitals) July 13, 2024