మ్యాక్స్‌ ‘వెరీవెల్‌’: భారీ ధరకు ఆర్సీబీ సొంతం

RCB Win Bidding War For Glenn Maxwell - Sakshi

చెన్నై: ఐపీఎల్‌-14 వ సీజన్‌కు సంబంధించి జరుగుతున్న మినీ వేలంలో ఆసీస్‌ ఆల్‌ రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ భారీ ధరకు అమ్ముడుపోయాడు.  ముందుగా ఊహించినట్లుగానే మ్యాక్స్‌వెల్‌ కోసం తీవ్ర పోటీ జరిగింది. మ్యాక్స్‌వెల్‌ కోసం ఆర్సీబీ కడవరకూ పోటీలో నిలిచి సొంతం చేసుకుంది. అతని కోసం భారీ మొత్తం చెల్లించింది ఆర్సీబీ. 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయడానికి సీఎస్‌కే-ఆర్సీబీల మధ్య తీవ్ర పోటీ నడిచింది. గతంలో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడగా అతన్ని ఈ సీజన్‌లో వదిలేసుకుంది.తీవ్రంగా నిరాశపరిచన కారణంగా మ్యాక్సీని పంజాబ్‌ విడుదల చేసింది. దాంతో వేలంలోకి వచ్చిన మ్యాక్సీ మరొకసారి జాక్‌పాట్‌ కొట్టాడు.

కాగా, తొలి రౌండ్‌ వేలంలో కొంతమంది స్టార్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి కనబరచలేదు. అరోన్‌ ఫించ్‌, అలెక్స్‌ హేల్స్‌, హనుమ విహారి, జేసన్‌ రాయ్‌, కేదార్‌ జాదవ్‌, ఎవిన్‌ లూయిస్‌లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. వీరికి సెకండ్‌ రౌండ్‌లో ఏమైనా అదృష్టం ఉంటుందో లేదో చూడాలి. 

ఇక్కడ చదవండి: 
స్టీవ్‌ స్మిత్‌కు జాక్‌పాట్‌ లేదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top