IND vs AUS: జడేజాతో అట్లుంటది మరి.. డైవ్‌ చేస్తూ సంచలన క్యాచ్‌! వీడియో వైరల్‌

Ravindra Jadeja takes a great catch, Marnus Labuschagne goes - Sakshi

ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ మార్నస్‌ లాబుషేన్‌ను ఓ సంచలన క్యాచ్‌తో జడ్డూ పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 23 ఓవర్‌ వేసిన కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో లాబుషేన్‌ కట్‌షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో  షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా.. తన కుడివైపుకు డైవ్‌ చేస్తూ అద్భుతమైన స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. జడేజా సూపర్‌ క్యాచ్‌ను చూసిన  లాబుషేన్‌ బిత్తిరిపోయాడు. అదే విధంగా స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్న జడ్డూను ప్రేక్షకులు చప్పట్లు కొట్టి అభినందించారు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఆసీస్‌ నిలకడగా ఆడుతోంది. 26 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌(81) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి.
చదవండిTim Paine: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top