వాటే స్పెల్‌ రషీద్‌..

Rashid Shines With Ball Help SRH Victory - Sakshi

అబుదాబి:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్‌ హైదరాబాద్‌ విజయంలో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. రషీద్‌ ఖాన్‌ కట్టుదిట్టమైన స్పెల్‌తో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. రషీద్‌ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో మూడు వికెట్లు సాధించి 14 పరుగులే ఇచ్చాడు. నాలుగు కంటే తక్కువ ఎకానమీతో మెరిశాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్, రిషభ్‌ పంత్‌‌ల వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. తన లెగ్‌ బ్రేక్‌లతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించాడు. రషీద్‌ బౌలింగ్‌తో ఢిల్లీపై ఒత్తిడి పెంచింది సన్‌రైజర్స్‌. మరొక స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చినా రషీద్‌ మాత్రం తన లైన్‌ను తప్పకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేశాడు.

ఫలితంగా సన్‌రైజర్స్‌ విజయానికి బాటలు వేసుకుంది. ఇక పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన భువీ.. వికెట్‌ తీసి ఏడు పరుగులే ఇచ్చాడు. మరొక స్పెల్‌లో వికెట్‌తో పాటు మొత్తంగా 25 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు భువీ. ఆదిలోనే పృథ్వీషాను ఎక్స్‌ట్రా అవుట్‌ స్వింగర్‌తో పృథ్వీషాను బోల్తా కొట్టించాడు. దాంతో ఢిల్లీ రెండు పరుగుల వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై ఢిల్లీని రషీద్‌ ఖాన్‌,నటరాజన్‌లో ఒత్తిడిలోకి నెట్టారు. నటరాజన్‌ వికెట్‌ సాధించి ఢిల్లీ రన్‌రేట్‌ను తగ్గించడంలో ప్రధాన భూమిక పోషించాడు. 4 ఓవర్ల స్పెల్‌లో 25 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. స్టోయినిస్‌ను ఎల్బీ చేసి మంచి బ్రేక్‌ ఇచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top