Rohit Sharma: బహుశా రోహిత్‌ నోరు జారి ఉంటాడు.. అతడు ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఏంటి?: పాక్‌ మాజీ క్రికెటర్‌

Rashid Latif Says Rohit Might Have Slip Tongue Ashwin All Time Great Comment - Sakshi

రవిచంద్రన్‌ అశ్విన్‌.. టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ ఇటీవల అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. భారత జట్టు తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశూ రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 435వ వికెట్‌ సాధించాడు. తద్వారా టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌(434 వికెట్లు)రికార్డును అధిగమించాడు. పర్యాటక లంక రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా అసలంకను ఔట్‌ చేయడం ద్వారా ఈ ఫీట్‌ సాధించాడు. 

ఇక రోహిత్‌ శర్మ టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్‌ మీద 222 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ విజయంలో బౌలర్ల పాత్ర మరువలేనిది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టి విజయంలో తన వంతు సహకారం అందించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అశూపై ప్రశంసల జల్లు కురిపించాడు. 

‘‘నా దృష్టిలో అతడు ఆల్‌ టైమ్‌ గ్రేట్‌. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అందుకే నా అభిప్రాయం ప్రకారం తను ఎల్లప్పుడూ గొప్ప ఆటగాడే’’ అంటూ కొనియాడాడు. అతే, ఈ విషయంలో తాను రోహిత్‌ శర్మ వ్యాఖ్యలతో ఏకీభవించలేనని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ అన్నాడు. భారత క్రికెట్‌లో అశూ దిగ్గజ బౌలర్‌ అంటే ఒప్పుకోనన్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘అశ్విన్‌ గొప్ప బౌలర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది. 

ముఖ్యంగా స్వదేశంలో టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. కాబట్టి భారత్‌లో అతడు అత్యుత్తమ స్పిన్నర్‌ అని చెప్పవచ్చు. అయితే, విదేశాల్లో మాత్రం నా అభిప్రాయం ప్రకారం అనిల్‌ కుంబ్లే గొప్ప బౌలర్‌. బిషన్‌ సింగ్‌ బేడీ కూడా అద్భుత బౌలర్‌. కాబట్టి రోహిత్‌ శర్మ వ్యాఖ్యలతో నేను ఏకీభవించలేను. బహుశా రోహిత్‌ నోరు జారి ఉంటాడు. లేదంటే ఆటగాళ్లను ప్రోత్సహించే క్రమంలో అశూను ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ అని ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. కాగా అశ్విన్‌ స్వదేశంలోనే  పైగా వికెట్లు సాధించాడు.

చదవండి: IPL 2022- CSK: సీఎస్‌కే అభిమానులకు గుడ్‌న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top