గుడ్‌ న్యూస్‌ చెప్పిన రషీద్‌ ఖాన్‌ | Rashid Khan welcomes baby boy Azlan after Gujarat Titans win vs KKR in IPL 2026 | Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌ చెప్పిన రషీద్‌ ఖాన్‌

Apr 18 2026 3:52 PM | Updated on Apr 18 2026 3:56 PM

Rashid Khan welcomes baby boy Azlan after Gujarat Titans win vs KKR in IPL 2026

అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్న‌ర్‌, గుజ‌రాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ తండ్రయ్యాడు. అత‌డి భార్య పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్‌ను రషీద్‌ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన చిన్నారికి 'అస్లాన్ ఖాన్' అని పేరు పెట్టినట్లు రషీద్ వెల్ల‌డించాడు. ఈ ప్రపంచంలోకి నా లిటిల్ ప్రిన్స్‌కు స్వాగతం అంటూ రషీద్ ఓ పోస్ట్ పెట్టాడు. 

దీంతో అతడికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రషీద్ ఖాన్ గతేడాది ఆగస్టులో రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ముందు 2024 అక్టోబర్‌లో పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్  మొదటి పెళ్లి జరిగింది. రషీద్  వివాహ వేడుకకు అఫ్గానిస్తాన్‌ క్రికెటర్లంతా హాజరయ్యారు. 

కానీ ఏడాది తిరగకుముందే వ్యక్తిగత కారణాల చేత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు తన రెండో భార్యకు మగ బిడ్డ జన్మించడంతో రషీద్ తండ్రయ్యాడు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌-2026లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడిన ర‌షీద్ 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
చదవండి: ‘విరాట్‌ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement