సింగపూర్ ఓపెన్ నుంచి పీవీ సింధు అవుట్ | PV Sindhu loses to world no. 1 An Se Young in Singapore Open quarterfinals | Sakshi
Sakshi News home page

సింగపూర్ ఓపెన్ నుంచి పీవీ సింధు అవుట్

May 29 2026 6:52 PM | Updated on May 29 2026 8:21 PM

PV Sindhu loses to world no. 1 An Se Young in Singapore Open quarterfinals

సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్ర‌వారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ప్రపంచ నంబర్ 1, అన్ సే యాంగ్(దక్షిణ కొరియా) చేతిలో సింధు ఓట‌మి పాలైంది. 

దాదాపు 48 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో యాంగ్ దూకుడు ముందు సింధు నిలవ‌లేక‌పోయింది. దీంతో ఈ సౌత్ కొరియా సూప‌ర్ స్టార్ 21-17, 21-14 తేడాతో వరుస సెట్లలో సింధుపై విజ‌యం సాధించింది. అన్ సే యంగ్ చేతిలో సింధు ఓడిపోవ‌డం ఇది వ‌రుస‌గా 9వ సారి కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక సింధు ఇంటిముఖం ప‌ట్టిన స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి  మాత్రం సెమీస్‌లో అడ‌గుపెట్టారు. క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఈ భార‌త ద్వ‌యం మలేషియా జోడీ కాంగ్ ఖాయ్ గ్జింగ్ – అరోన్ తాయ్‌పై 19-21, 21-17, 21-13తో అద్భుత విజయం సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement