టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఆ సిరీస్‌కు ముహూర్తం ఖరారు! | Sakshi
Sakshi News home page

IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఆ సిరీస్‌కు ముహూర్తం ఖరారు!

Published Sun, Jul 9 2023 9:02 AM

Postponed India vs Afghanistan ODI Series schedule confirmed by Jay Shah - Sakshi

క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌. భారత్‌-ఆఫ్గానిస్తాన్‌ మధ్య వన్డే సిరీస్‌కు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌-ఆఫ్గానిస్తాన్‌ మధ్య వన్డే సిరీస్‌ జరగనున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ జైషా వెల్లడించాడు.  శుక్రవారం ముంబైలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత జై షా ఈ ప్రకటన చేశాడు.

కాగా వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లో మూడు వన్డేల సిరీస్‌ కోసం ఆఫ్గానిస్తాన్‌ జట్టు భారత్‌లో పర్యాటించాల్సింది. కానీ ఇరు జట్ల బీజీబీజీ  షెడ్యూల్‌ కారణంగా ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను వాయిదా వేశారు. భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ అనంతరం ఇరు జట్లకు తగినంత విరామం లభించనుండంతో ఇప్పుడు ఈ సిరీస్‌ను జనవరిలో ప్లాన్‌ చేశారు.

ఇక అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మీడియా రైట్స్‌ ఫైనల్‌ చేసే పనిలో అపెక్స్ కౌన్సిల్ పడిం‍ది. ఈ క్రమంలో స్వదేశీ ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌ల కోసం కొత్త మీడియా హక్కుల ఒప్పందాన్ని ఆగస్టు చివరి నాటికి పూర్తి చేస్తామని జైషా తెలిపారు. 

డొమెనికాకు చేరుకున్న భారత జట్టు
ఇక వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా.. డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు బార్బడోస్‌ నుంచి శనివారం డొమినికాకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అక్కడికి చేరుకున్న భారత జట్టు మూడు రోజుల ప్రాక్టీస్‌ క్యాంప్‌లో పాల్గోనుంది.

వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ.

చదవండి: అంబటి రాయుడు కీలక నిర్ణయం

Advertisement
 
Advertisement
 
Advertisement