
2022 చివర్లో కారు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరు సమీపంలోని ఆలుర్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన వార్మప్ గేమ్‌లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్ చాలా యాక్టివ్‌గా కనిపించాడు. యాక్సిడెంట్‌కు ముందులా కాకపోయినా మైదానంలో చురుగ్గా కలియదిరిగాడు. పంత్ ప్రస్తుత పరిస్థితి చూస్తే యాక్సిడెంట్ తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. ఇదే కొనసాగితే ఐపీఎల్ 2024తో పంత్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది
నివేదికల ప్రకారం.. 26 ఏళ్ల పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తులు కూడా ధృవీకరించారు. అయితే పంత్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని తెలుస్తుంది. పంత్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డీసీ యాజమాన్యం అతన్ని వికెట్‌కీపింగ్‌కు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పంత్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (ఎన్‌సీఏ) పునరావాసం పొందుతున్నాడు. అతను గత నెలలో బీసీసీఐ ఆధ్వర్యంలో లండన్‌లో చికిత్స చేయించుకున్నాడు. ఎన్‌సీఏ నుండి క్లియరెన్స్ పొందిన తర్వాతే పంత్ ఐపీఎల్‌లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అవుతుంది. పంత్ గైర్హాజరీలో గత ఐపీఎల్ సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్-2024 ప్రారంభ తేదీపై ఇంకా క్లారిటీ రాని విషయం తెలిసిందే. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం కావడంతో బీసీసీఐ.. ఐపీఎల్ స్టార్టింగ్ తేదీపై ఎలాంటి ప్రకటన చేయలేకపోతుంది. తాజాగా లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రారంభ తేదీపై ఓ క్లూ వదిలాడు. జనవరి 22వ తేదీన లీగ్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపాడు. లీగ్‌కు సంబంధించి ఏ ప్రకటన వచ్చినా అది కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన అనంతరమే ఉంటుందని అన్నాడు. మరోవైపు ఐపీఎల్ షెడ్యూల్ దశలవారీగా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.