రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన పాక్‌ బౌలర్లు | Pakistan Bowlers shine in 2nd ODI too, Aussies set down for just 231 runs | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన పాక్‌ బౌలర్లు

Jun 2 2026 8:52 PM | Updated on Jun 2 2026 8:52 PM

Pakistan Bowlers shine in 2nd ODI too, Aussies set down for just 231 runs

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను 200 పరుగులకే ఆలౌట్‌ చేసి, ఆతర్వాత సునాయాస విజయం సాధించిన పాక్‌ జట్టు.. ఇవాళ (జూన్‌ 2) జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్‌పై పట్టు బిగించింది.

లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన పాక్‌.. ఆసీస్‌ను 231 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. తొలి వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగిన లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ అరాఫత్‌ మిన్హాస్‌ (10-2-27-2) ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు.

అరాఫత్‌తో పాటు మరో స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ (10-1-34-2), పేసర్లు షాహీన్‌ అఫ్రిది (8-1-36-3), హరీస్‌ రౌఫ్‌ (10-1-49-2) కూడా రాణించడంతో ఆసీస్‌ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లిస్‌ (51), కెమరూన్‌ గ్రీన్‌ (53), మ్యాట్‌ రెన్షా (43), ఒలివర్‌ పీక్‌ (31) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అలెక్స్‌ క్యారీ డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ మాథ్యూ షార్ట్‌ 15, లబూషేన్‌ 5, కుహ్నేమన్‌ 5, నాథన్‌ ఇల్లిస్‌ 5 పరుగులకు ఔటయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement